తమిళంలో హిట్టైన సినిమాలను తెలుగులోకి రీమేక్ చేయటమో, డబ్బింగ్ చేయటమో చేస్తూంటారు. కొన్ని సార్లు ఆ సినిమాలు ఇక్కడ మన తెలుగులోనూ హిట్ అవుతూటాయి. అలా సంక్రాంతికి తమిళంలో విడుదలైన 'మద గజ రాజా' భారీ విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి జనవరి 31 న తీసుకు వచ్చారు.
తమిళంలో సుమారు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రత్యకత ఏమిటంటే... 12 ఏళ్ళ తర్వాత విడుదల కావడం! ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లు. తెలుగులోనూ విశాల్ కు మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా భారీగానే రిలీజ్ చేసారు..రిజల్ట్ ఏమిటో చూద్దాం.