`లవ్‌స్టోరీ` రివ్యూ.. నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్‌ కమ్ముల మ్యాజిక్ వర్కౌట్‌ అయ్యిందా?

First Published Sep 24, 2021, 1:17 PM IST

 ప్రేమ(love), కులం(caste), పరువు హత్యలపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. వస్తున్నాయి. కూల్‌ మూవీస్‌తో అన్ని వర్గాల ఆడియెన్స్ కి దగ్గరైన శేఖర్‌ కమ్ముల(sekhar kammula) తాజాగా `లవ్‌స్టోరి`(lovestory)లో ఇదే విషయాన్ని టచ్‌ చేశాడు. నాగచైతన్య(naga chaitanya), సాయిపల్లవి(sai pallavi) కలిసి నటించిన ఈ సినిమా నేడు(శుక్రవారం) విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 

టెక్నాలజీ పెరిగినా, మనిషి దేశాలు దాటి, ఆకాశంలోకి ఎగిరిపోతున్నా ఇంకా పట్టణాల్లోనూ, పల్లెల్లో కులం జాడ్యం విడవలేదు. ఇంకా పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సమాజంలో ఇది నిత్యం చర్చనీయాంశంగా మారుతుంది. దీనిపై వ్యతిరేకతలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా ఇన్సిడెంట్‌ జరిగినప్పుడు అది హాట్‌ టాపిక్‌గా మారుతుంది. సెలబుల్ పాయింట్‌ అవుతుంది. కానీ సినిమా విషయానికి వస్తే అది అవుట్‌ డేటెడ్‌ అంశమనే చెప్పాలి. ప్రేమ, కులం, పరువు హత్యలపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. వస్తున్నాయి. సెన్సిబుల్‌ మూవీస్‌తో అన్ని వర్గాల ఆడియెన్స్ కి దగ్గరైన శేఖర్‌ కమ్ముల తాజాగా `లవ్‌స్టోరి` ఇదే విషయాన్ని టచ్‌ చేశాడు. నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన ఈ సినిమా నేడు(శుక్రవారం) విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 

`లవ్‌ స్టోరి` కథః రేవంత్‌ ఆర్మూర్‌(తెలంగాణ) నుంచి హైదరాబాద్‌కి వచ్చిన కుర్రాడు. తక్కువ కులానికి చెందిన రేవంత్‌ చిన్నప్పుడు తన ఊర్లో పెద్ద కులం వాళ్ల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మనది పై చేయి సాధించాలంటే డబ్బు సంపాదించాలని, బిజినెస్‌ అందుకు బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తాడు. హైదరాబాద్‌లో జుంబా(డాన్స్ ) సెంటర్ ని నడిపిస్తుంటాడు. ఇంతలో జాబ్‌ కోసమని ఆర్మూర్‌కి చెందిన, పెద్ద కులానికి చెందిన మౌనిక(సాయిపల్లవి) హైదరాబాద్‌కి వస్తుంది. తన ఫ్రెండ్‌ రూమ్‌లో దిగుతుంది. మౌనిక ఫ్రెండ్‌ రూమ్‌, రేవంత్‌ ఉండే రూమ్ పక్కన పక్కనే. 
 

బి.టెక్ పూర్తి చేసిన మౌనిక సాఫ్ట్ వేర్‌ జాబ్ కోసం ప్రయత్నాలు చేయగా, విఫలమవుతుంది. దీంతో రేవంత్‌ నిర్వహించే డాన్స్‌ సెంటర్‌లో డాన్సర్‌గా చేరి తానేంటో నిరూపించుకుంటుంది. అలా రేవంత్‌, మౌనిక కలిసి ఫిట్‌నెస్‌ సెంటర్‌ని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడతారు. రేవంత్‌కి మౌనిక వాళ్లది అగ్రకులమని, తనకు సెట్‌ కాదని భావిస్తుంటాడు. కానీ మౌనిక చెప్పే మాటలతో నమ్మకం కలుగుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. మరి తమ ప్రేమ కోసం ఏం చేశారు. కులంపై ఎలాంటి పోరాటం చేశారు. బాలికలపై లైంగిక వేధింపులు, చిన్నప్పుడు మౌనిక ఎదుర్కొన్న ఘటనలు ఏంటనేది మిగిలిన సినిమా. 

Love Story

విశ్లేషణః శేఖర్‌ కమ్ముల అంటే సెన్సిబుల్‌ డైరెక్టర్‌. కూల్‌ సినిమాలు రూపొందిస్తూ ఏ క్లాస్‌ వర్గాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. శేఖర్‌ కమ్ముల సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అనే నమ్మకం ఆడియెన్స్ లో ఉంది. కానీ `లవ్‌స్టోరి` సినిమా చూశాక ఆ నమ్మకానికి బీటలు పడతాయని చెప్పొచ్చు. కులం, పరువు హత్యలు అనే కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతానికది అవుట్‌ డేటెడ్‌ కథాంశమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల `అర్థశతాబ్దం` అనే ఓటీటీ సినిమాలో కూడా కులం, పరువు హత్యలను అద్భుతంగా చూపించారు. కానీ శేఖర్‌ కమ్ముల అంతకు మించి కొత్తగా ఇందులో చెప్పలేకపోవడం ఆలోచించదగ్గ విషయం. 

సినిమా ప్రారంభం నుంచి అగ్ర కులం, తక్కువ కులం విషయాలను ప్రధానంగా హైలైట్‌ చేసిన శేఖర్‌ కమ్ముల దాన్ని లోతులను చూపించడంలో, కన్విన్సింగ్‌గా, కొత్తగా చూపించడంలో వెనకబడ్డాడు. సినిమా మొదటి భాగం మొత్తం నాగచైతన్య సెటిల్‌ అవడం, జుంబా సెంటర్‌ని డెవలప్‌ చేయడంపైనే చూపించారు. దీనికి చైతూ, సాయిపల్లవిల మధ్య లవ్‌ స్టోరి యాడ్‌ చేశాడు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ అంశాలు కాస్త ఆకట్టుకుంటాయి. మొదటి భాగం మరి లాగ్‌గా ఉంటుంది. కేవలం ఫస్టాఫ్‌ చూస్తేనే సినిమా మొత్తం చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ని ఫాస్ట్ గా ఫినిష్‌ చేశాడు. క్లైమాక్స్ కూడా అర్థాంతరంగా ముగించిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఇందులో లోన్‌ కోసం చైతూ బ్యాంక్ వెళ్లినప్పుడు వచ్చే `రిక్షావోడికి వాడికి రిక్షాస్తే ఇస్తే రిక్షానే తొక్కుతాడు` అనే డైలాగ్‌ మాత్రమే సినిమాలో ఉంచారు. దీనికి కంటిన్యూగా(ట్రైలర్‌లో ఉన్న) గొర్రెలు కాసే వాడికి గొర్లు ఇస్తే, గొర్లే కాసుకుంటాడు. ఇంకెప్పుడు డెవలప్‌ అయితం సర్‌' అనే డైలాగ్‌ని కట్ చేయడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ డైలాగ్‌ తీసివేయడం సినిమాపై ప్రభుత్వ వర్గాల ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తుంద

Love story release

నిజానికి సినిమా సాడ్‌ ఎండింగ్. సాయిపల్లవిని చిన్నప్పుడే లైంగికంగా వేధించిన తన బాబాయ్‌‌(రాజీవ్‌ కనకాల)ని క్లైమాక్స్ లో ఎదురిస్తాడు చైతూ. దీంతో అతను చైతూని చంపేందుకు ప్రయత్నాలు చేస్తాడు. చైతూ, రాజీవ్‌ కనకాలతో ఫైట్‌ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు రాజీవ్‌ చనిపోతాడు. అయితే ముందుగానే పోలీసులకు చైతూని చంపమని చెబుతాడు రాజీవ్. దీంతో చైతూని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తాడు. అంతటితో సినిమాకి ఎండింగ్‌ ఇచ్చారు. కట్‌ చేస్తే కోర్ట్ చైతూ నిర్ధోశిగా తీర్చు ఇవ్వడం ఫైనల్‌ ఎండింగ్‌ పాయింట్‌. చైతూ చంపితే సాడ్‌ ఎండింగ్‌ అవుతుంది, ఆడియెన్స్ జీర్ణించుకోలేరని భావించిన యూనిట్‌ చివరి నిమిషంలో పాజిటివ్‌ ఎండింగ్‌ క్లైమాక్స్ మొత్తం ఓ ఐదు నిమిషాల్లో పూర్తయిన ఫీలింగ్‌ కలుగుతుంది. దీంతో అసంతృప్తితోనే బయటకు రావడం ఆడియెన్స్ వంతు అవుతుంది. 

నటీనటుల ప్రతిభః సినిమా ఆద్యంతం తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుంది. చైతూ కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. డైలాగ్‌ డెలివరీ విషయంలో సహజత్వం పండించాడు చైతూ. ఇక ఇన్నోసెంట్‌ అబ్బాయిగా చైతూ నటన ఆకట్టుకుంటుంది. తన పాత్ర సగటు తెలంగాణ కుర్రాడిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో ఊర్లో ఉన్న వాళ్ల ఇళ్లు సగటు పల్లెల్లోని కుర్రాళ్లకి కనెక్టింగ్‌ పాయింట్‌. ఊర్లో గంగవ్వ సన్నివేశాలు కాస్త నవ్వులు పూయిస్తాయి. ఇక మౌనిక పాత్రకి ప్రాణం పోసింది సాయిపల్లవి. తెలంగాణ యాసలో బాగా మాట్లాడింది. ఆమె డాన్సులు సినిమాకి ప్రధాన బలం. జుంబా సెంటర్‌లో ఆమె ఇంట్రడక్షన్‌ డాన్స్ కట్టిపడేస్తుంది. ఇక `సారంగ దరియా` పాటతో ఇప్పటికే ఆడియెన్స్ లోకి వెళ్లిపోయింది సాయిపల్లవి. ఈ సినిమాలో అంతో ఇంతో ప్రధానంగా ఆకట్టుకునే పాయింట్‌ సాయిపల్లవి పాత్ర, ఆమె డాన్సులే అని చెప్పొచ్చు.  చైతూ, సాయిపల్లవి కెమిస్ట్రీ కూడా ఫర్వాలేదు.మరోవైపు అగ్రకులానికి చెందిన వ్యక్తిగా రాజీవ్‌ కనకాల యాప్ట్ గా అనిపించారు. ఉత్తేజ్‌ సైతం మెప్పించాడు. చైతూ తల్ల ఈశ్వరీ రావు మరో ఆకట్టుకునే పాత్ర అవుతుంది.
 

టెక్నీకల్‌గా సంగీతం సినిమాకి ప్రధాన బలం. పవన్‌ అద్భుతమైన పాటలు అందించారు. ఇప్పటికే అవి శ్రోతలను మెప్పించాయి. విజువల్‌గానూ మంత్రముగ్దుల్ని చేస్తాయి. విజయ్ సి కుమార్ కెమెరా వర్క్ ఫర్వాలేదు. ఎడిటర్‌ ఫస్టాఫ్  ని ఎడిటింగ్‌ చేయడంలో సందిగ్దంలో పడ్డాడు. 
 

పాజిటివ్‌ అంశాలు 
నాగచైతన్య పాత్ర,  
సాయిపల్లవి పాత్ర, డాన్సులు
పవన్‌ సంగీతం..

మైనస్‌ అంశాలు

రొటీన్‌ స్టోరీ(అవుట్‌ డేటెడ్‌ స్టోరి)
ఫస్టాఫ్ ,  స్లో నెరేషన్‌
అర్థంతరంగా ముగించిన క్లైమాక్స్..

ఫైనల్‌ థాట్‌ః శేఖర్‌ కమ్ముల లాంటి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ నుంచి ఇలాంటి రొటీన్‌ స్టోరీని ఎవరూ ఊహించరు. ఈ విషయంలో అసంతృప్తినే మిగుల్చుతుంది. సాయిపల్లవి పాత్ర, డాన్సులు పక్కన పెడితే ఇదొక రొటీన్‌ `లవ్‌స్టోరి`అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.

రేటింగ్‌-2/5

click me!