ఎవరికోసమో బ్రతకాల్సిన పనిలేదు... ఆ విమర్శలకు సమంత ఘాటు సమాధానం

Published : Aug 14, 2023, 09:25 AM IST

ఓ హీరో ఫ్యాన్స్ సమంతను విమర్శించగా ఆమె పరోక్షంగా సమాధానం చెప్పారు. తనదైన శైలిలో ట్రోలర్స్ కి చురకలు వేశారు. 

PREV
16
ఎవరికోసమో బ్రతకాల్సిన పనిలేదు... ఆ విమర్శలకు సమంత ఘాటు సమాధానం


హీరోయిన్ సమంత చాలా ఇండిపెండెట్. ఆమె ఆలోచన ధోరణి భిన్నంగా ఉంటుంది. తాను నమ్మిన సిద్ధాంతంకి కట్టుబడి ఉంటుంది. ముఖ్యంగా తన జీవితం మీద ఒకరి ఆధిపత్యం సహించదు. మనసులో ఉన్న విషయాన్ని నేరుగా కుండబద్దలు కొడుతుంది. ఇక తనపై వచ్చే విమర్శలకు సమంత సమాధానం చెబుతారు. 

 

26

నాగ చైతన్యతో విడాకుల విషయంలో సమంత దారుణమైన క్రిటిసిజం ఫేస్ చేశారు. ఆమెపై పలు నిరాధార ఆరోపణలు వినిపించాయి. ఆమెకు ఎఫైర్స్ అంటగట్టడంతో పాటు పిల్లల్ని కనడం ఇష్టం లేదని పుకార్లు లేపారు. ఇవి సమంతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశాయి. అయినప్పటికీ ఆమె ఎదిరించి నిలిచారు. 

36

తాజాగా సమంత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్స్ కి గురయ్యారు. ఖుషి ట్రైలర్ విడుదల ఈవెంట్లో సమంత పాల్గొనలేదు. ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి కారణమైంది. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనకపోతే ఎలా అంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విమర్శలకు సమంత పరోక్షంగా సమాధానం చెప్పింది. 


 

46

''మీరు ఈ లోకం కోసం బ్రతకాల్సిన పనిలేదు. మీ గౌరవం ఏమిటో తెలుసుకోండి. మీ స్థాయిని పెంచుకోండి. మీరు మీ కోసం బ్రతకండి ఈ సమాజం కోసం కాదు. మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అది అంత అవసరం లేదు. పది మందిలో ఒకరిలా కాకుండా యూనిక్ గా జీవించండి' అని ఒక నోట్ పంచుకున్నారు. 

56

ఏం చేసినా విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు. మన జీవనశైలి మార్చుకో కూడదని సమంత చెప్పారు. ఈ మాటలు పరోక్షంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఉద్దేశించే అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. 

 

66

ఇక ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా శివ నిర్వాణ తెరకెక్కించారు. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. సమంత గత చిత్రం శాకుంతలం కూడా డిజాస్టర్. కాబట్టి ఖుషితో వీరిద్దరూ కమ్ బ్యాక్ అవుతారేమో చూడాలి... 

click me!

Recommended Stories