సింపుల్ కామెడీతో లాజిక్ లేకుండా చేసిన `జాతిరత్నాలు` చిత్రం బంపర్ హిట్ సాధించింది. అలాంటి తరహాలోనే ఇప్పుడు `లైక్ షేక్ అండ్ సబ్‌స్క్రైబ్` తెరకెక్కించింది. `జాతిరత్నాలు` ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించగా, ఓటీటీ ఫిల్మ్స్, కాన్సెప్ట్ చిత్రాలు చేసుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రమిది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆముక్తా క్రియేషన్స్ పతాకాలపై తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం(నవంబర్ 4)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. Like Share &Subscribe Review
కథః
విప్లవ్(సంతోష్ శోభన్) గువ్వ విహారి అనే యూట్యూబ్‌ని రన్ చేస్తున్న ట్రావెల్ వ్లోగర్. యూట్యూబ్‌లో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్న వసుధ(ఫరియా అబ్దుల్లా)ని స్ఫూర్తిగా తీసుకుని తన యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తుంటాడు. ఆమెలా తను కూడా ఎదగాలనుకుంటాడు. వసుధ డీజీపి కూతురు. వసుధలా మిలియన్స్ ఫాలోవర్స్, వ్యూస్ రావాలంటే అరకు ట్రావెలింగ్ చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేయాలని నిర్ణయించుకుంటాడు విప్లవ్. ఫారెస్ట్ లో తన గురించి చెబుతున్న క్రమంలో పడిపోతున్న విప్లన్‌ని కాపాడే సీన్‌తో వీరిద్దరు కలుసుకుంటారు. తనకు నెగటివ్ కామెంట్లు పెట్టినందుకు అతనిపై ఫైర్ అవుతుంది వసుధ. ఆమె కోపాన్ని తగ్గించి ఆమెకి దగ్గరవుతాడు. ఇంతలో పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్(పీపీఎఫ్) దళాలను చెందిన ముగ్గురు నాయకులను శాంతి చర్చలకు పిలిచి చంపేసిన పోలీసులపై ప్రతీకారం తీసుకోవాలనుకుంటుంది పీపీఎఫ్ దళం. అందుకు డీజీపీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. అరకులో డీజీపీ కూతురు ఉందని తెలిసి ఆమెని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. మరి ఆ కిడ్నాప్ జరిగిందా? పోలీసులు వారిని సేవ్ చేశారా? వసుధ, విప్లవ్ ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది కథ. Like Share &Subscribe Review
విశ్లేషణః
నిజానికి `జాతిరత్నాలు` ఓ మ్యాజిక్. కథ లేకపోయినా, నటీనటుల కామెడీ యాక్టింగ్, సీన్లతో నవ్వులు పూయించింది. హిట్ అయ్యింది. అన్నింటికి అదే ఫార్ములా అప్లై చేస్తే బొక్కా బోర్లా పడటం ఖాయం. `లైక్ షేర్ సబ్ స్క్రైబ్` విషయంలో ఆల్మోస్ట్ అదే జరిగిందని చెప్పొచ్చు. ఇందులో కథ భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. ఒకదాని తర్వాత ఒకటి సీన్లు అలా వచ్చిపోతుంటాయి. కేవలం అక్కడక్కడ కామెడీ సీన్లు పడ్డాయి. కానీ ప్రతి సీన్ లోనే కామెడీ పుట్టించాలని ప్లాన్ చేస్తే అది కిచిడిలా మారిపోతుందనడానికి ఈ సినిమానే నిదర్శనం. కథగా చెప్పుకోవడానికని దర్శకుడు పోలీసులు, పీపీఎఫ్ దళ మధ్య ఘర్షణ ఎపిసోడ్లు క్రియేట్ చేశాడు తప్ప అందులో బలమైన కాన్ల్ఫిక్ట్ లేదు. యూట్యూబ్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకునేందుకు వెళ్లిన వీళ్లు ఆ విప్లవ దళానికి దొరికిపోవడం, అక్కడ నుంచి తప్పించుకునేందుకు వీరు చేసే ప్రయత్నాలు విఫలం కావడం అక్కడక్కడ నవ్వులు పూయించాయి. కానీ చాలా సందర్భాల్లో విసుగు తెప్పించాయి. మరీ అతిగా చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సినిమాకి సోల్ లేకపోవడం పెద్ద మైనస్. సీన్ల వైజ్‌గా నవ్వుకోవడం తప్పితే సోల్ కనెక్ట్ కాదు. సినిమాకి ప్రధాన బలం బ్రహ్మాజీ. కామెడీ అంటే ఆయన్నుంచి పుట్టిందే. పీపీఎఫ్ దళం బహిష్కరించిన బ్రహ్మాన్నగా తనేంటో నిరూపించుకునే క్రమంలో ఈ గ్యాంగ్ చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. వీరి ఎపిసోడ్లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. కానీ హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లుగానీ, హీరో కమెడియన్ సుదర్శన్ మధ్య వచ్చే సీన్లు బోరింగ్‌గా మరీ ఓవర్‌గా అనిపిస్తుంటాయి. మరోవైపు పీపీఎఫ్ దళం చేసే యాక్టివిటీస్ గురించి బలంగా చెప్పలేకపోయారు. ఆ ఎపిసోడ్‌ని కేవలం హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలను నడిపించేందుకు మాత్రమే ఉపయోగించినట్టుగా ఉంటుంది. అయితే చివరగా వారికి సంబంధించిన సందేశాత్మక అంశాలు బాగున్నాయి. కానీ అవి కొత్తకాదు. దీంతో ఇదొక రొటీన్ కామెడీ సినిమాలా మారిపోయింది. ఓటీటీ ఫిల్మ్ ని థియేటర్లో రిలీజ్ చేసినట్టుంది.
నటీనటులుః
విప్లవ్ పాత్రలో సంతోష్ శోభన్ బాగా నటించారు. ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన సీన్లు, డైలాగులు చాలా సందర్భాల్లో ఓవర్‌గా అనిపిస్తాయి. హీరో నానిని ఇమిటేట్ చేసిన ఫీలింగ్ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంటుంది. ఫరియా అబ్దుల్లా తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. సినిమాకి తన ఓ అసెట్‌గా నిలిచింది. సుదర్శన్, బ్రహ్మాజీ అండ్ టీమ అదరగొట్టారు. మిగిలిన ఆర్టిస్టులు తమ పాత్రల పరిధి మేరకు యాక్ట్ చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
దర్శకుడు మేర్లపాక గాంధీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయనలో అలాంటి భావాలే ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం. కథ లేకుండా సినిమాని తీయాలనే ఆయన ధైర్యానికి మొక్కాల్సిందే. ఎమోషనల్‌గా ఈ సినిమా ఏ విధంగానూ కనెక్ట్ అయ్యేలా లేదు. ఇక మ్యూజిక్ పరంగా బాగుంది. కానీ ఫోక్ సాంగ్‌ని రొమాంటిక్‌గా తీయడమే ఆడియెన్స్ కనెక్ట్ అవ్వలేకపోతారు. మిగిలిన పాటలు ఓకే అనిపిస్తాయి. విజువల్‌గా ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా పని చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు ఓకే. తక్కువ బడ్జెట్ లోనే తీసేశారనిపిస్తుంది.
Like Share &Subscribe Review
ఫైనల్‌గాః అక్కడక్కడ కొన్ని సీన్లు నవ్వించే తప్ప సినిమాలో అసలు విషయమే లేదు.
రేటింగ్‌ః 2.25