1600 సినిమాలు, 5000 పైగా నాటకాలు, 12 ఏళ్లకే స్టార్, 60 ఏళ్లు ఇండస్ట్రీని ఏలిన నటి ఎవరో తెలుసా?

Published : Aug 14, 2026, 02:40 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగు వెలిగి తారలు ఎంతో మంది ఉన్నారు. చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి .. 60 ఏళ్లు పరిశ్రమను ఏలిన నటి గురించి మీకు తెలుసా? మూడు తారాల తారలతో నటించిన ఆమె రికార్డు ఎవరికీ సాధ్యం కాదేమో?

PREV
14
ఆరు దశాబ్దాల సినీ ప్రయాణం..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటనతో, నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ తో, హాస్యంతో, ఎమోషన్ తో, నవరసాలు పలికించగల నటీనటులు చాలామంది ఉన్నారు. దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వారిలో మహానటి మనోరమ కూడా ఒకరు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, అగ్ర హీరోలకు సమానంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

24
నాటకరంగం నుంచి సినిమాల్లోకి..

మనోరమ1937 మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో జన్మించారు . ఆమె అసలు పేరు గోపి శాంత కాగా, చిత్ర పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ ఆమెను అందరూ ఆప్యాయంగా 'ఆచి' అని పిలుచుకుంటారు. కేవలం 12 ఏళ్ల అతి చిన్న వయసులో నాటకాల్లో నటించడం ప్రారంభించిన మనోరమ.. నాటక రంగంలో ఎంతో అనుభవాన్ని గడించారు. ఆ అనుభవమే ఆమె తరువాతి సినీ జీవితానికి అత్యంత బలమైన పునాదిగా నిలిచింది.

34
ఏడుగురు ముఖ్యమంత్రులతో స్క్రీన్ పంచుకున్న నటి..

మనోరమ గారి కెరీర్‌లో చాలా ప్రముఖంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే.. ఆమె తన కెరీర్ లో ఏడుగురు ముఖ్యమంత్రులతో నటించింది. అన్నాదురై, ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్), కరుణానిధి, జయలలిత, ఎన్.టి. రామారావు (ఎన్టీఆర్), ఎం.కె. స్టాలిన్ తో పాటు తలపతి విజయ్ వంటి ఏడుగురు ప్రముఖ నేతలతో (ముఖ్యమంత్రులతో) కలిసి నటించిన అరుదైన రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు.

44
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆచి..

మనోరమ కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ,సింహళ భాషల్లో నటించారు ఆమె తన కెరీర్‌లో ఏకంగా 1600 లకు పైగా సినిమాల్లో నటించింది. అంతే కాదు కెరీర్ బిగినింగ్ నుంచి మరణించే వరకు దాదాపు 5000 కంటే ఎక్కువ రంగస్థల ప్రదర్శనలు ఇచ్చింది. ఈ రెండింటి కలయికతో ఆమె 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం పొందిన అరుదైన కళాకారిణిగా నిలిచింది.

నటనలోనే కాకుండా తన గాత్ర మాధుర్యంతో సుమారు 300 పాటలు పాడి.. నేపథ్య గాయనిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది మనోరమ. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా లీనమైపోయే మనోరమ భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 2015 లో మనోరమ అనారోగ్య కారణాల వల్ల 78 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Read more Photos on
click me!

Recommended Stories