బేబమ్మ చూపులకు గుండెలో దడ దడమని శబ్ధం.. ఆపటం కష్టమే.. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తున్న కృతి శెట్టి..

Published : Jul 29, 2022, 11:19 AM IST

‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty)బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ఇటీవల మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.  

PREV
16
బేబమ్మ చూపులకు గుండెలో దడ దడమని శబ్ధం.. ఆపటం కష్టమే.. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తున్న కృతి శెట్టి..

కుర్ర హీరోయిన్ కృతి శెట్టి పేరు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో ఈ బ్యూటీ అవకాశాలను కల్పిస్తూ బేబమ్మను స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుస్తున్నారు. మరోవైపు కృతి శెట్టి కూడా పెర్పామెన్స్ లో ఏమాత్రం తగ్గడం లేదు. 
 

26

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన ఈ యంగ్ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేస్తూ మతిపోగొడుతోంది. సినిమా సినిమాకు వేగం పెంచుతూ స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇటు టాలీవుడ్ తో పాటు.. అటు కోలీవుడ్ లోనూ అవకాశాలను చేజిక్కించుకుంటోంది. 
 

36

రీసెంట్ గా  ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’ (The Warriorr) చిత్రంలో ‘విజిల్ మహాలక్ష్మి’గా అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి గ్రేస్ మామూలుగా లేదు.. రామ్ పోతినేనినే ఢీకొట్టేలా యంగ్ బ్యూటీ డాన్స్, డైలాగ్స్, యాక్టింగ్ లో అదరగొట్టింది. ఆడియెన్స్ కూడా బేబమ్మ పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యారు. 

46

ఇలా వరుస చిత్రాలతో అలరిస్తున్న బేబమ్మ.. ఇటు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ట్రెడిషనల్ గా, ట్రెండీ వేర్స్ లోనూ దర్శనమిస్తూ కుర్రకారును, నెటిజన్లను ఖుషీ చేస్తోంది. బేబమ్మ గ్లామర్ కు యువత చిత్తైపోతోంది. 

56

తాజాగా ఈ యంగ్ బ్యూటీ పింక్ మినీ ఫ్రాక్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. స్టన్నింగ్ స్టిల్ తో, మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల గుండెల్లో దడ దడమనే శబ్ధం వచ్చేలా చేస్తోంది. దీంతో కృతి శెట్టి ఫొటోలను అభిమానులు, ఫాలోవర్స్ లైక్స్, కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు. 

66

బేబమ్మ ప్రస్తుతం హీరో నితిన్ (Nithiin) సరసన ‘మాచర్ల నియోజకవర్గం’లో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాలను మాత్రం జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బేబమ్మ కూడా తనవంతుగా క్రేజీ ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. అలాగే తమిళంలో ‘సూరియా 44’ (Suriya 44)లోనూ నటిస్తోంది.  

click me!

Recommended Stories