బ్లాక్‌ డ్రెస్‌లో అప్సరసలా మెరిసిపోతున్న బేబమ్మ.. మరోసారి డెబ్యూ హీరోయిన్‌ అవార్డు కొట్టేసిన కృతి శెట్టి..

Published : Oct 09, 2022, 09:06 PM IST

టాలీవుడ్‌కి `బేబమ్మ`గా పరిచయం అయ్యింది కృతి శెట్టి. క్యూట్‌ అందాలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కుర్ర హృదయాలను దోచుకుంది. గ్లామర్‌ ఫోటోలతోనూ చూపు తిప్పుకోనివ్వడం లేదు ఈ యంగ్‌ సెన్సేషన్‌. 

PREV
17
బ్లాక్‌ డ్రెస్‌లో అప్సరసలా మెరిసిపోతున్న బేబమ్మ.. మరోసారి డెబ్యూ హీరోయిన్‌ అవార్డు కొట్టేసిన కృతి శెట్టి..

కృతి శెట్టి(Krithi Shetty) `ఉప్పెన` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. రెండేళ్లు కూడా పూర్తి కాలేదు ఏకంగా ఆరు సినిమాల్లో మెరిసి సందడి చేసింది. ఈ ఏడాదంతా కృతిదే అనేట్టుగా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో మెప్పించింది. అదే సమయంలో హాట్‌ ఫోటో షూట్‌లతోనూ మరింతగా రచ్చ చేస్తుంది కృతి. కుర్రాళ్లకి అందాల విందు ఇస్తుంది. 
 

27

తాజాగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు(FilmFareAwardsSouth2022) ఫంక్షన్‌లో మెరిసింది. బెంగుళూరులో 67వ సౌత్‌ ఫిల్మ్ ఫేర్‌ అవార్డు(2022) వేడుక ఆదివారం సాయంత్రం జరుగుతుంది. ఇందులో బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది కృతి శెట్టి. టైట్‌ ఫిట్ లాంటి డ్రెస్‌లో అప్సరసలా మెరిసిపోతుంది. ఇందులో రెడ్‌ కార్పెట్‌ వద్ద ఫోటోలకు పోజులిచ్చింది కృతి శెట్టి. 
 

37

బ్లాక్‌ డ్రెస్‌లో కృతి అందాల మరింత హాటెక్కిపోవడం విశేషం. ఆమె హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌ అయ్యింది. ప్రారంభంలో క్యూట్‌ అందాలతో మెప్పించిన కృతి ఇప్పుడు యమ సెక్సీగా మారిపోయింది. ఆమె గ్లామర్‌ డోస్‌ పెంచుతూ మరింత హాట్‌గా కనిపిస్తుంది. అలాగే తాజాగా ఫిల్మ్ ఫేర్‌ అవార్డు ఈవెంట్‌లోనూ మెరిసి కనువిందు చేస్తుంది. 
 

47

దీంతో ఇప్పుడు కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో మరోసారి తన సత్తాని చాటింది కృతి శెట్టి. మరో అవార్డుని సొంతం చేసుకుంది. 
 

57

గతేడాది `ఉప్పెన` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బేబమ్మగా తన అద్భుతమైన నటనతో మెప్పించింది కృతి శెట్టి. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అయిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఇప్పుడు అవార్డుల పరంగానూ సత్తా చాటుతుంది. ఇటీవల `సైమా` వేడుకలో ఉత్తమ నటిగా కృతి డెబ్యూ హీరోయిన్‌ అవార్డు సొంతం చేసుకుంది. 
 

67

ఇప్పుడు ఫిల్మ్ ఫేర్‌ వేడుకలోనూ ఉత్తమ డెబ్యూ హీరోయిన్‌గా `ఉప్పెన` చిత్రానికిగానూ అవార్డుని దక్కించుకోవడం విశేషం. అంతేకాదు ఉత్తమ డెబ్యూ టాలీవుడ్‌ హీరోగా వైష్ణవ్‌ తేజ్‌కి కూడా ఫిల్మ్ ఫేర్‌ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆయా చిత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

77

కృతి శెట్టి ఇటీవల నటించిన చిత్రాలన్నీ పరజయం చెందాయి. ఇప్పుడు ఆమె నాగచైతన్యతో వెంకట్‌ ప్రభు సినిమాలో చేస్తుంది. అలాగే ఓ మలయాళ సినిమాకి కూడా సైన్‌ చేసిందని సమాచారం. అదే సమయంలో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సినిమాలోనూ అందాల ఆరబోతకు సిద్దమే అనేసిగ్నల్స్ ఇస్తుంది కృతి శెట్టి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories