Krishna Mukunda Murari: బాగా కృంగిపోతున్న కృష్ణ.. భార్య మీద అనుమానపడుతున్న మురారి?

First Published May 30, 2023, 1:52 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది. తన భర్త హృదయంలో మరొక అమ్మాయి ఉందని తెలుసుకుని బాధపడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో కుటుంబ సభ్యులందరూ భోజనాలకి కూర్చుంటారు. అలేఖ్యని నాప్కిన్స్ ఎక్కడ పెట్టావ్ అని అడుగుతుంది రేవతి. నాకు తెలియదు అని చెప్తుంది అలేఖ్య. అయితే రాము మురారి బట్టల తో పాటు పైకి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు అంటుంది రేవతి. అంతలోనే కృష్ణ దంపతులిద్దరూ భోజనాలకి కిందకు దిగుతారు. డల్ గా ఉన్న కృష్ణ ని చూసి ఎందుకలా ఉన్నావు.

 మీ ఏసీపీ సర్  ఏమైనా అన్నారా అని అడుగుతుంది రేవతి. నేనేమీ అనలేదు అంటాడు మురారి. నచ్చదు నువ్వు తింగరి పెళ్లి లాగా ఉంటేనే మాకు నచ్చుతుంది అంటుంది రేవతి. తింగరి పిల్ల అనేసరికి తన భర్త తనని నీలో నాకు నచ్చేది ఆ తింగరి తనమే అని చెప్పటం.. తనని డాక్టర్ తింగరి పిల్ల అని పిలవడం గుర్తొచ్చి ఆనందపడుతుంది. మళ్లీ డైరీలో ఉన్న విషయాలు గుర్తొచ్చి బాధపడుతుంది.

 అది సరేగాని నాప్కిన్లు నీ గదిలో ఉన్నాయా అని కృష్ణని అడుగుతుంది రేవతి. నాకు తెలియదు అంటుంది కృష్ణ. ఉన్నాయమ్మ రాము నా ఇస్త్రీ బట్టలతో పాటు తీసుకుని వచ్చేసాడు అని చెప్తాడు మురారి. వెళ్లి తీసుకురా అని కృష్ణతో చెప్తుంది రేవతి. ఎక్కడా డైరీ చూసే వస్తుందో అని కంగారుపడిన మురారి నేను వెళ్లి తీసుకు వస్తాను అని చెప్తాడు. ఏరా మీ ఆవిడ అలిసిపోతుందా అని సరదాగా అడుగుతుంది రేవతి.

అదేమీ కాదమ్మా ఇప్పటికే రెండుసార్లు పైకి కిందకి తిప్పినట్లుగా ఉన్నావు అంటాడు మురారి. ఈసారి నేను పంతానికి పోతాను మీ ఆవిడకి పని చెప్పడానికి ఆమాత్రం నాకు రైట్స్ లేవా అంటుంది రేవతి. గబగబా ఫోన్ తీసుకొని షూట్ చేస్తూ ఉంటాడు మధు. బాగా తిట్టుకోండి పెళ్ళాంతో కొట్టుకోండి ఇలాంటి తల్లి కొడుకుల ఫైటింగ్ మరి ఎక్కడ ఉండి ఉండదు మంచి వ్యూస్ వస్తాయి అంటూ ఎగస్ట్రాలు చేస్తాడు.

నోరు మూసుకొని కూర్చో అంటూ ప్రసాద్ మందలించడంతో కామ్ గా కూర్చుంటాడు మధు. నేను వెళ్లి నాప్కిన్స్ తీసుకొస్తాను అని తన గదికి వెళుతుంది కృష్ణ. డైరీ గుర్తొచ్చి బాగా ఎమోషనల్ అవుతుంది. మళ్లీ డైరీ ని తీసి చదవటం ప్రారంభిస్తుంది. మనం లడక్  వెళ్ళిన రోజు నాకు అది ఒక పుణ్యక్షేత్రం లాగా అనిపించింది అంటే ఒక పేజీలో రాసి ఉంటుంది. మరొక పేజీలో నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను.

 ప్రపంచంలోనే ఎంత పెద్ద అందగత్తె వచ్చినా కూడా చలించను అని రాసి ఉంటుంది. ఆ తరువాత పేజీలలో ఏమీ రాసి ఉండదు. ఏసీబీ సార్ మనసులో మరొక అమ్మాయి ఉందా ఆ విషయం తెలియక నేనే నా మనసును ఇచ్చాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ. సెప్టెంబర్ 16న మా పెళ్లి అయింది అందుకే అప్పటినుంచి ఈ డైరీలో ఏమీ రాయలేదు అనుకుంటుంది.

 చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుతెచ్చుకుంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. మరోవైపు వెళ్లి ఇంకా రాలేదు అంటే తను డైరీ చదివి ఉంటుందా అంటూ కంగారు పడతాడు మురారి. ఇంతలో నాప్కిన్స్ తీసుకుని కిందికి వస్తుంది కృష్ణ. భోజనానికి ముందు వెళ్లిన నా కోడలు అందరూ చేతులు కడుక్కునే టైంకి వస్తుంది అని ఆట పట్టిస్తుంది రేవతి. అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతారు.

 మురారి కూడా భోజనం ముగించి కంగారుగా తన గదికి వెళ్తాడు. డైరీ తీసి చివరి పేజీలు చదువుతాడు. గురువుగారి మీద అభిమానంతో కృష్ణని పెళ్లి చేసుకున్నాను కానీ రాను రాను ఆమె మీద ఇష్టం ఏర్పడుతుంది అని అందులో వ్రాసి ఉంటుంది. అది చదువుకుంటాడు మురారి. తరువాయి భాగంలో వర్షంలో ఏడుస్తూ నిలిచి ఉంటుంది కృష్ణ. డైరీలో తను చదివింది తలుచుకొని ఏడుస్తుంది.

కృష్ణ వర్షంలో తడవటాన్ని చూసి బయటకు వస్తాడు మురారి ఏం చేస్తున్నావు అంటూ మందలిస్తాడు. నా దగ్గర బోలెడన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటిని గురించి తెలుసుకునే సరికి నా జీవితం అయిపోతుంది. మీరు పోలీస్ ఆఫీసర్ కాదు పెద్ద దొంగ అని ఏడుస్తుంది కృష్ణ.

click me!