Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు

Published : Mar 11, 2026, 02:48 PM IST

'అన్నాత్తే' సినిమా షూటింగ్ టైంలో 98 కిలోలు ఉండేదాన్ని. ఇప్పుడు నా బరువు తగ్గడం పెద్ద వైరల్ అయింది. 55 ఏళ్ల వయసులో కూడా నాకు బీపీ, షుగర్ లాంటివి ఏమీ లేవు, చాలా ఆరోగ్యంగా ఉన్నానని నటి ఖుష్బూ సుందర్ తెలిపారు.

PREV
14
ఖుష్బూ సుందర్‌ ఫిట్‌ నెస్‌ సీక్రెట్‌

ఖుష్బూ కేవలం తమిళ సినిమాకే కాదు, తెలుగు, కన్నడ, మలయాళ భాషల ఆడియెన్స్ కి కూడా ఇష్టమైన హీరోయిన్‌.  ఇప్పుడు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా హీరోయిన్‌గా, అమ్మగా, సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తూ అలరించారు. ఇటీవల ఆమె బరువు తగ్గి, చాలా స్లిమ్‌గా మారారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు, తన వెయిట్ లాస్ ప్రయాణం వెనుక ఉన్న కారణాలను ఖుష్బూ పంచుకున్నారు.

24
55 ఏళ్లలోనూ బీపీ, షుగర్ లేదు

రజనీకాంత్ నటించిన 'అన్నాత్తే' సినిమా షూటింగ్ సమయంలో తాను 98 కిలోల బరువు ఉన్నానని ఖుష్బూ చెప్పారు. ఇప్పుడు 55 ఏళ్లు వచ్చినా తనకు బీపీ, షుగర్ లాంటివి ఏమీ లేవని, ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమని ఆమె అన్నారు. మైదా, చపాతీ వంటి ఆహార పదార్థాలు తినడం మానేశానని ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ తెలిపారు.

34
98 కిలోలు ఉండేదాన్ని - ఖుష్బూ
ఆ ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. "నాకు ఇప్పుడు 55 ఏళ్లు. ఈ వయసులో కూడా నాకు బీపీ, షుగర్ లేవు. అవి రాకూడదనే కోరుకుంటున్నా. మా అమ్మకు హై బీపీ ఉండేది. కానీ మైగ్రేన్, సైనస్ సమస్యలు మాత్రం అమ్మ నుంచి నాకు వచ్చాయి. కానీ ఆ జబ్బు (బీపీ) రాలేదు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నా. 'అన్నాత్తే' సినిమా టైంలో 98 కిలోలు ఉండేదాన్ని. మా ఇల్లు చాలా పెద్దది. మెట్లు ఎక్కి దిగేటప్పుడు మోకాళ్ల నొప్పులు, ఆయాసం వచ్చేవి" అని చెప్పారు.
44
ఖుష్బూ ఇచ్చే టిప్స్

`అద్దంలో నా ముఖం చూసుకుంటే నాకే భయమేసేది. ఏనుగులా గుండ్రంగా ఉండేది. చివరికి, బీపీ రాకుండా ఉండాలన్నా, మోకాళ్ల నొప్పులు పోవాలన్నా బరువు తగ్గాల్సిందే అని ఫిక్స్ అయ్యా. కోవిడ్ టైంలో బరువు తగ్గడం మొదలుపెట్టా. ఈ బరువు తగ్గడానికి నాలుగేళ్లు పట్టింది. మైదా, చపాతీ లాంటివి తినను. ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. నేను సినిమాకు వచ్చినప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడూ ప్రేక్షకులు నన్ను ఆదరించారు. లావయ్యాక కూడా వాళ్లు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వారికి నచ్చే విధంగా మారిపోయాను` అని ఖుష్బూ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories