అయితే ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీకి ఉండాల్సిన స్థాయిలో హైప్ కంటే కాస్త తక్కువే ఉంది. దానికి కారణం ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీనితో సెకండ్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూశారు. కొద్దీ సేపటి క్రితమే రిలీజైన సెకండ్ ట్రైలర్ ఒక్కసారిగా ఫ్యాన్స్ లో ఆత్రుతని రగిల్చేసింది. ట్రైలర్ లో యాక్షన్ ఘట్టాలు, ప్రభాస్ ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి.