బంపరాఫర్ కొట్టిన శ్రీనిధి శెట్టి , బాలయ్య జోడీగా కెజియఫ్ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ..?

Published : Sep 16, 2023, 01:12 PM IST

కెజియఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది హీరోయిన్ శ్రీనిథి శెట్టి. కాని ఆ సినిమా తరువాత ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్న శ్రీనిధికి తాజాగా టాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.   

PREV
16
బంపరాఫర్ కొట్టిన శ్రీనిధి శెట్టి , బాలయ్య జోడీగా కెజియఫ్ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ..?

కెజియఫ్ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ శ్రీనిథి శెట్టి. హీరో యష్ అంత ఫేమస్ అవ్వకపోయినా.. కన్నడ నాట ఓ రేంజ్ లో ఇమేజ్ సాధించింది బ్యూటీ. అయితే అటు యష్ కాని.. ఇటు  శ్రీనిథి శెట్టి కాని కెజియఫ్ తరువాత సినిమాలు చేసింది లేదు. శ్రీనిధి విక్రమ్ సినిమాలో నటించినా.. అది ప్లాప్ అవ్వడంతో.. అస్సలు జనాలకు రిజిస్టర్ అవ్వలేదు ఈ కన్నడ పిల్ల.

26
Image: Still from the movie

కెజియఫ్ సినిమాతో బాగా ఫేమస్ అయిన వారిలో.. పాన్ ఇండియ రేంజ్ లో  హీరో  యష్ ఫేమస్ అయితే..కన్నడనాట మాత్రం యష్ తో పాటు.. హీరోయిన్  శ్రీనిధి శెట్టి కూడా బాగా ఫేమస్ అయ్యింది.  కెజియఫ్  1 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన యష్,శ్రీనిధి శెట్టి ఇద్దరు ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు. ఆ తర్వాత వచ్చిన కెజియఫ్ 2 సినిమా కూడా వీరికి స్టార్డమ్ ని తెచ్చి పెట్టింది. 
 

36
Srinidhi Shetty

ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ కి వెళ్ళిపోయారు ఈ ఇద్దరు. అయితే ఇంత రేంజ్ అందుకున్నప్పటికీ శ్రీనిధి శెట్టికి మరోమంచి అవకాశం మాత్రం రాలేదు. అవకాశం రావడం లేదు. ఆమెకు ఇతర అవకాశాలు కూడా రావడం లేదు. అందుకు ఓ కారణం ఆమెకు కెజియఫ్ సినిమా టైమ్ లోనే మూడు పదుల వయస్సు దాటడంతో.. హీరోయిన్ గా ఛాన్సులు పెద్దగా రాలేదు. 
 

46
srinidhi shetty

కాని కెజియఫ్ తరువాత తమిళం నుంచి భారీ ఆఫర్ అందుకుంది బ్యూటీ. కాని అది కూడా పెద్దగా ఉపమోగపడలేదు. టైమ్‌ కలిసి రాకో, అదృష్టం లేకో శ్రీనిధికి అహా అనిపించే ఒక్క ఆఫర్‌ రావడం లేదు. ఈ మధ్య విక్రమ్‌తో చేసిన కోబ్రాపై గంపెడాశలు పెట్టుకుంది. కానీ సినిమా రిజల్ట్‌ తేడాకొట్టడంతో ఆమె కెరీర్‌ కూడా ప్రశ్నార్థకంలా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు

56

అలాంటి టైమ్‌లో శ్రీనిధి ఇంటి గుమ్మం దగ్గరి ఓ భారీ ఆఫర్‌ వచ్చిందట. అది కూడా టాలీవుడ్‌ నుంచి. బాలయ్య, బాబీతో చేయబోయే సినిమాలో శ్రీనిధినే ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇప్పటికే కథ చెప్పడం. . సూపర్ ఫ్ గా నచ్చడం లాంటివి ముగిశాయని ఇన్‌సైడ్‌ రిపోర్ట్స్‌. ఈ సినిమా గనుక క్లిక్‌ అయితే శ్రీనిధి శెట్టికి కాలం కలిసొచ్చినట్లే. 

66

ప్రస్తుతం ఈ ప్రకటనను చిత్రబృందం హోల్డ్‌లో పెట్టారని తెలుస్తుంది. భగవంత్‌ కేసరి రిలీజైన తర్వాతే ఈ సినిమా గురించి అప్‌డేట్స్‌ ఇచ్చే చాన్స్‌ ఉందట. అందులో మొదటి అప్‌డేట్‌ ఇదే అవ్వొచ్చని సమాచారం. ఎట్టకేలకు ఇన్నాళ్లకు శ్రీనిధి గుమ్మం వద్దకే ఆఫర్‌ వచ్చింది.

click me!

Recommended Stories