ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేజిఎఫ్ నటి మాళవిక అవినాష్ డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు చేశారు. రావణుడు శివ భక్తుడు, లంకలో ఉంటాడు.. అతనికి 64 కళల్లో ప్రావీణ్యం ఉంది. కానీ మన చరిత్రని, రామాయణాన్ని బాలీవుడ్ దర్శకులు వక్రీకరిస్తున్నారు. రామాయణాన్ని ఇలా వక్రీకరించడం ఆపండి. రామాయణం చదవలేదా ? కనీసం ఎన్టీఆర్ పోషించిన పాత్రలని కూడా చూడలేదా అని మాళవిక అవినాష్ ఓం రౌత్ పై దుమ్మెత్తి పోశారు.