Yash Says Sorry: అక్కడ అల్లు అర్జున్, ఇక్కడ యష్..అదే తప్పు, కానీ ఎక్కడ తగ్గాలో తెలిసినోళ్లు

Published : Apr 11, 2022, 04:17 PM IST

సౌత్ లో పాన్ ఇండియా చిత్రాల హంగామా జోరందుకుంది. గతంలో అంటే ప్రాంతీయ భాషా చిత్రాలని లోకల్ గానే విడుదల చేసేవారు. దీనితో చిత్ర యూనిట్ తమ సొంత రాష్ట్రంలో ప్రమోషన్స్ చేసుకుంటే సరిపోయేది.

PREV
18
Yash Says Sorry: అక్కడ అల్లు అర్జున్, ఇక్కడ యష్..అదే తప్పు, కానీ ఎక్కడ తగ్గాలో తెలిసినోళ్లు
KGF2

సౌత్ లో పాన్ ఇండియా చిత్రాల హంగామా జోరందుకుంది. గతంలో అంటే ప్రాంతీయ భాషా చిత్రాలని లోకల్ గానే విడుదల చేసేవారు. దీనితో చిత్ర యూనిట్ తమ సొంత రాష్ట్రంలో ప్రమోషన్స్ చేసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలు కావడంతో హీరోలకు ప్రమోషన్స్ పేరుతో చుక్కలు కనిపిస్తున్నాయి. 

28
KGF2

ఇటీవలే చూశాం.. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం జక్కన్న.. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరిని దేశం మొత్తం ఎండా గాలికి తిప్పాడు. ఒక దశలో వీరి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారా లేక తీర్థ యాత్రలకు వెళుతున్నారా అనే సందేహం కూడా అభిమానులకు కలిగింది. పుష్ప చిత్రం కోసం అల్లు అర్జున్ ఆ రేంజ్ లో కాకున్నా బాగానే ప్రమోషన్స్ చేశాడు. ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ వంతు వచ్చింది. 

38
KGF2

యష్ నటించిన కెజిఎఫ్ 2 చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కెజిఎఫ్ చిత్రం ఘనవిజయం సాధించడంతో కెజిఎఫ్ 2పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులని సైతం కెజిఎఫ్ 2 బ్రేక్ చేస్తుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా హీరో యష్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు. 

48
KGF2

పుష్ప మూవీ రిలీజ్ టైంలో అల్లు అర్జున్ బెంగుళూరులో మీడియా సమావేశానికి గంటన్నర ఆలస్యంగా హాజరయ్యాడు. దీనితో కన్నడ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బన్నీని ప్రశ్నించారు. ఇలా తమని గంటల పాటు ఎదురుచూసేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించగా బన్నీ స్పందించాడు. 

58
Yash

అసలు ఈ ప్రోగ్రాం ఉన్నట్లు తనకు ముందుగా సమాచారం లేదు అని బన్నీ తెలిపాడు. అప్పటి కప్పుడే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేను ప్రైవేట్ ఫ్లైట్ లో ఇక్కడకి వచ్చాను. పొగ మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లైట్ టేకాఫ్ కావడం డిలే అయింది. అంతే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు.. ఏది ఏమైనా నా వల్ల తప్పు జరిగింది కాబట్టి సారీ అని బన్నీ కన్నడ మీడియాకు క్షమాపణలు తెలిపాడు. మీ చేత సారీ చెప్పింకోవాలని కాదు అని మీడియా అనగా.. చిన్న సారీ చెప్పినంత మాత్రాన నేనేమీ తగ్గిపోయినట్లు కాదు అని బన్నీ తెలిపాడు. 

68
Yash

దాదాపుగా ఇదే సీన్ వైజాగ్ లో రిపీట్ అయింది. హీరో యష్ ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి వైజాగ్ మీడియా సమావేశానికి బయల్దేరాడు. 

78
KGF2

వైజాగ్ ప్రెస్ మీట్ కి యష్ దాదాపు గంటన్నర ఆలస్యంగా వచ్చాడు. బన్నీ బెంగుళూరు మీడియా ప్రశ్నించినట్లుగానే.. తెలుగు మీడియా వైజాగ్ లో హీరో యష్ ని ప్రశ్నించింది. మీడియా సమావేశానికి ఇంత ఆలస్యంగా వస్తే ఎలా అని అడిగారు. దీనితో యష్ బదులిస్తూ.. గత కొన్ని రోజులుగా నేను ఎక్కడకి వెళుతున్నానో, వస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళితే ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నా. 

88
KGF2

ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాం. ఆలస్యానికి అది కూడా ఒక కారణం. కావాలని లేట్ చేయలేదు. 10 నిముషాలు కూడా విలువైనవే. కాబట్టి క్షమించండి అంటూ యష్ తెలుగు మీడియాని క్షమాపణలు కోరాడు. యాదృచ్చికంగా బన్నీ, యష్ విషయంలో ఒకేలా జరిగింది. దీనితో నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం అల్లు అర్జున్, యష్ ఎక్కడ తగ్గాలో బాగా తెలిసినోళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories