Guppedantha Manasu: రిషిని సేవ్ చేసిన కేడి బ్యాచ్.. తీవ్ర మనస్తాపంతో వసుధార!

Published : Aug 07, 2023, 07:21 AM ISTUpdated : Aug 07, 2023, 08:11 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తను ప్రేమించిన వాడు ప్రమాదంలో ఉన్నాడని నీడలా వెంటాడి కాపాడుకుంటున్న ఒక ప్రేమికురాలు కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: రిషిని సేవ్ చేసిన కేడి బ్యాచ్.. తీవ్ర మనస్తాపంతో వసుధార!

 ఎపిసోడ్ ప్రారంభంలో రిషి కారులో  వెళ్తుంటే వెనుక ఫాలో అవుతూ ఉంటుంది వసుధార. అయితే రిషి వెనక రెండు బండ్ల మీద నలుగురు వ్యక్తులు ఫాలో అవటం గమనిస్తుంది. అందులో ముందు రిషి ని అటాచ్ చేసిన వ్యక్తి ఉండడం గమనించి అంటే మళ్ళీ సార్ మీదికి ఎటాక్ చేయబోతున్నారా అని కంగారు పడుతుంది. ఆటో అతనికి వాళ్లని ఫాలో అవమని చెప్తుంది.కాసేపటి తర్వాత వాళ్లు మిస్ అవుతారు.
 

28

 వాళ్లని మిస్ అయినందుకు ఆటో డ్రైవర్ని మందలించి ఎవరికో మెసేజ్ పెడుతుంది. తను చెప్పిన దారిలో ఆటో డ్రైవర్ ని వెళ్ళమంటుంది. అదే సమయంలో రౌడీలు ఒక దగ్గర కాపు కాసి ఉంటారు ఈలోపు వాళ్లకి శైలేంద్ర ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాడు. లేదు సార్ ఇక్కడ కాపు కాసి కూర్చున్నాము అతను వస్తే వేసేయటమే  అంటారు రౌడీలు. వేస్తే పని అయిపోవాలి అంతే. ఇంతకు ముందులాగా సాకులు చెప్పకండి అసలే వాడిని రక్షించడానికి చాలా శక్తులు వెయిట్ చేస్తున్నాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర.
 

38

 రౌడీలు ఒక లేడీని ప్రెగ్నెంట్గా యాక్ట్  చేయమని చెప్పి రిషి వచ్చే దారిలో కూర్చో పెడతారు రిషి ఆ దారిలో వచ్చిన తర్వాత ఒక రౌడీ కార్ కి అడ్డగా వెళ్లి మా సిస్టర్ డెలివరీ పెయిన్స్ తో బాధపడుతుంది కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతాడు. రిషి కంగారుగా కారు దిగి ఆమెకి కారు ఎక్కిద్దాం అని ఆమె దగ్గరికి వెళ్తాడు. అయితే కారు వరకు వచ్చిన ఆమె సడన్గా కత్తి తీసి రిషి ని పొడవబోతుంది. అయితే రిషి ఒడుపుగా ఆ కత్తిని పట్టుకుంటాడు.
 

48

వెంటనే వెనక నా రౌడీలు కూడా వచ్చి రిషి ని పట్టుకుంటారు. అదే సమయంలో నిద్దట్లో ఉన్న జగతి రిషి ప్రమాదంలో ఉన్నాడని కలకంటుంది కంగారుపడి పెద్దగా కేక పెడుతూ నిద్ర లేచిపోతుంది. ఆ కంగారుకి మహేంద్ర కూడా లెగుస్తాడు ఏమైంది అని అడగటంతో రిషి ప్రమాదంలో ఉన్నాడు అని చెప్తుంది. కంగారు పడకు తనకేమీ జరగదు అని ధైర్యం చెప్తాడు మహేంద్ర.  సీన్ కట్ చేస్తే రిషి ని పొడవడానికి వచ్చిన వ్యక్తిని గుర్తుపడతాడు రిషి ఆరోజు అటాక్ చేసిన వాడివి నువ్వే కదా ఎవరు నువ్వు అని అడుగుతాడు.

58

ఆ వ్యక్తి పొగరుగా మాట్లాడుతూ ఈరోజు నా చేతిలో చస్తావు అంటూ కత్తి తీసి పొడిచే సమయంలో మొహం మీద లైట్లు పడటంతో అందరూ షాక్ అయి అటువైపు చూస్తారు. పాండ్యన్ తన ఫ్రెండ్స్ ని తీసుకొని ఆయుధాలతో సహా అక్కడికి వచ్చి వాళ్లతో ఫైట్ చేసి రిషి ని సేవ్ చేస్తాడు. అదే సమయంలో వసుధార కూడా  అక్కడికి వస్తుంది. అక్కడ జరుగుతున్న గొడవని చూస్తూ పక్కన నుంచుంటుంది. స్టూడెంట్స్ దాడికి తట్టుకోలేక రౌడీలు పారిపోతారు.

68

 మీరు ఎలా వచ్చారు అని అడుగుతాడు రిషి. వసుధార మేడం మెసేజ్ చేశారు అందుకే వచ్చాము అని చెప్తాడు పాండ్యన్. సరే మీరు వెళ్ళండి అని పాండ్యన్ వాళ్లని అక్కడి నుంచి పంపించేస్తాడు రిషి. ఇంతలో మహేంద్ర మసిధారికి ఫోన్ చేసి జగతి కంగారుపడుతుంది రిషికేమైనా జరిగిందా తను ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. తను బానే ఉన్నారు అని చెప్పి వీడియో కాల్ లో దూరం నుంచి రిషి ని చూపించి మళ్లీ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
 

78

 ఇంతలో శైలేంద్ర  రౌడీ ఫోన్ కి ఫోన్ చేస్తాడు అయితే గొడవ జరుగుతున్నప్పుడు ఫోన్ కింద పడిపోవడంతో అది అక్కడే ఉంటుంది ఆ ఫోన్ రిషి తీసి జేబులో పెట్టుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వసుధారని చూసి ఈ చీకట్లో మీరేం చేస్తున్నారు రండి ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఆమెని తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. వాళ్ల ఇంటి దగ్గర  డ్రాప్ చేసి న్ను రక్షించారు థాంక్స్ అంటాడు రిషి. ఇంతకుముందు కూడా మిమ్మల్ని రక్షించాను అంటుంది వసుధార.
 

88

 ఆరోజు మీరు నన్ను రక్షించలేదు చంపేశారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ మాటలకి బాధపడుతుంది వసుధార. ముభావంగా ఇంట్లోకి వచ్చిన కూతురిని ఏం జరిగింది అని అడుగుతాడు. రిషి సార్ ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఆయన బాగుండాలనే కదా నేను ఇన్ని మాటలు పడుతున్నాను అంటూ తండ్రి దగ్గర ఎమోషనల్ అవుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories