కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ ఎంగేజ్‌మెంట్‌..? రోకా ఫంక్షన్‌ అంటూ వార్తలు.. సీక్రెట్‌ రివీల్‌

Published : Aug 20, 2021, 09:09 AM IST

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌, యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని, ఇటీవల రోకా ఫంక్షన్‌ కూడా జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇందులో అసలు నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కత్రినా అధికార ప్రతినిధి స్పందించారు.  

PREV
17
కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ ఎంగేజ్‌మెంట్‌..? రోకా ఫంక్షన్‌ అంటూ వార్తలు.. సీక్రెట్‌ రివీల్‌

కత్రినా కైఫ్‌ ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌లతో ప్రేమాయణం సాగించి బ్రేకప్‌ చెప్పింది. ఇప్పుడు విక్కీ కౌశల్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారు. గత రెండేళ్లుగా ఈ ఇద్దరు ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు.

27

ప్రేమ పక్షల్లా విహరిస్తున్నారు. వరుసగా పార్టీలు, పబ్‌ల్లో సందడి చేస్తున్నారు. ఫెస్టివల్స్, ప్రీమియర్స్ లోనూ కలిసే కనిపిస్తున్నారు. తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ రిలేషన్‌ విషయంలో చాలా ఓపెన్‌గానే ఉందీ జంట. 

37

అయితే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని, రోకా ఫంక్షన్‌ కూడా జరిగిందని, ఇటీవల బాలీవుడ్‌లో వార్తలు వైరల్‌ అయ్యాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇద్దరి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 
 

47

ఇదిలా ఉంటే తాజాగా కత్రినా అధికార ప్రతినిధి స్పందించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రోకా ఫంక్షన్‌ జరగలేదని స్పష్టం చేశారు. త్వరలో కత్రినా సల్మాన్‌ ఖాన్‌ `టైగర్‌3` చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతుందని తెలిపారు. 
 

57

ఆమె షూటింగ్‌లతో బిజీగా ఉందని, ఎలాంటి రోకా ఫంక్షన్‌ చేసుకోలేదని తెలిపారు. అయితే విక్కీ, కత్రినా కలిసి ఉన్నారనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అది నిజమే అన్నారు. డేటింగ్‌లో ఉన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమ రిలేషన్‌ విషయంలో వాళ్లిద్దరు చాలా ఓపెన్‌గానే ఉన్నట్టు తెలిపారు. 
 

67

ఇదిలా ఉంటే కత్రినా మరోసారి మోసపోయిందనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. తనకంటే ఐదేళ్లు చిన్న అయిన విక్కీతోనూ ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనే వార్తలు కూడా బాలీవుడ్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది సస్పెన్స్. 

77

`ఉరి` చిత్రంతో పాపులర్‌ అయ్యారు విక్కీ కౌశల్‌. ప్రస్తుతం `సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌`, `సమ్‌ బహదుర్`, `ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ`, `మిస్టర్‌ లేలే` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక కత్రినా నటించిన `సూర్యవంశీ` రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. `ఫోన్‌ బూత్‌`, `టైగర్‌ 3`, `జీ లే జారా` చిత్రాల్లో నటిస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories