నోట్లో బీడీ చేతిలో కోడి ఊరమాస్ లుక్ లో కార్తీకదీపం వంటలక్క... మనకు తెలియని మరోకోణం చూపించిందిగా!

First Published Jun 12, 2021, 2:34 PM IST

బుల్లితెర అనే అడవిలో కార్తీక దీపం సీరియల్ సింహం. ఈ సీరియల్ ప్రసారం అవుతున్న సమయంలో మిగతా ఛానల్స్ ఈగలు తోలుకుంటూ ఉంటాయి. ఈ సీరియల్ కి పోటీ ఇచ్చిన ఒక్కటంటే ఒక్క ప్రోగ్రాం ఇంకా పుట్టలేదు. 
 

ఏళ్లు గడుస్తున్నా ఎక్స్పైరీ లేని వైన్ వలె కార్తీక దీపం డిమాండ్ పెరుగుతూ పోతుంది. ఈ సీరియల్ వెనక్కునెట్టి ఆడియన్స్ ని వాళ్ళ వైపుకు తిప్పుకోవాలని మిగతా చానళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కావడం లేదు.
undefined
రొటీన్ కంటెంట్ తో ఎమోషన్స్ పండిస్తూ జనాలతో కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటాయి కార్తీక దీపం పాత్రలు. కార్తీక దీపం ప్రధాన పాత్ర అయిన దీప అలియాస్ వంటలక్క తీరని కష్టాలు, ఒంటరి బ్రతుకు కార్తీక దీపం సీరియల్ లో హైలెట్స్.
undefined
అపార్థం చేసుకున్న భర్త ప్రేమకు దూరమైనా దీపను డాక్టర్ బాబు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు, ఆమె కష్టాలు ఎప్పుడు తీరతాయని ప్రేక్షకులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దీప పాత్ర చేసిన ప్రేమీ విశ్వనాథ్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.
undefined
సోషల్ మీడియాలో ప్రేమి విశ్వనాథ్ ని లక్షలలో ఫాలో అవుతున్నారు. టీవీ సీలెబ్రిటీలలో ప్రేమీ విశ్వనాథ్ తెలియనివారుండరు. ఒక్క సీరియల్ తోనే ఆమె ఫేమ్ భారీగా పెరిగింది.  ఇక ప్రేమీ విశ్వనాథ్ తన ఫ్యాన్స్ కోసం ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటారు.
undefined
తాజాగా తలపై పాగా, నోట్లో బీడీ, చేతిలో కోడి పుంజు పట్టుకొని పచ్చని పొల్లాలో ఫోటో షూట్ చేసింది.  అచ్చు గోదారి జిల్లాల కుర్రోడిలా మాస్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది.
undefined
బుల్లితెరపై సాంప్రదాయం పాత్రలో పద్దతిగా కనిపించే ప్రేమి కొత్త లుక్ తెగ వైరల్ అయ్యింది.
undefined
click me!