Karthika deepam 2
2017 అక్టోబర్ నెలలో మొదలైన కార్తీకదీపం నిర్విరామంగా సాగింది. భారీ ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ అనేక రికార్డులు నమోదు చేసింది. జాతీయ స్థాయిలో అత్యధిక టీఆర్పీ సాధించిన సీరియల్ గా ఉంది. కార్తీక దీపం సీరియల్ లోని ప్రధాన పాత్రలు కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క, మోనిత పిచ్చ ఫేమస్.
కార్తీక దీపం సక్సెస్ఫుల్ ప్రాంచైజీగా ఉన్న నేపథ్యంలో దాన్ని కొనసాగించాలని స్టార్ మా కోరుకుంటుంది. ఈ క్రమంలో కార్తీక దీపం 2 తెరపైకి తెచ్చారు. కార్తీక దీపం 2 ఫిబ్రవరి 25 నుండి స్ట్రీమ్ కానుంది. దీంతో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు. ఒక సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి.
మార్చి 21న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కార్తీక దీపం 2 సీరియల్ కి భారీ ప్రచారం కల్పించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు. నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ ఈ వేడుకలో పాల్గొననున్నారు.
కాగా మోనిత పాత్ర చేసిన శోభ శెట్టి సీక్వెల్ లో నటించడం లేదు. ఈ మేరకు ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. కార్తీక దీపం 2లో నటించమని నన్ను ఎవరూ సంప్రదించలేదని శోభ శెట్టి అన్నారు. బిగ్ బాస్ హౌస్లో ఆమెకు నెగిటివ్ ఇమేజ్ రావడం కూడా మైనస్ అయ్యింది.
ఇక కార్తీక దీపం 2 సీరియల్ ప్రోమో చూస్తే... డాక్టర్ బాబు ఇంట్లో వంటలక్క పనిమిషిగా ఉంది. వంటలక్కకు ఓ కూతురు ఉంది. డాక్టర్ బాబు ఆ కూతురికి బాగా కనెక్ట్ అయ్యాడు. మొత్తంగా ఏదో కొత్త స్టోరీ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు.