కరాటే కళ్యాణికి ఊహించని షాక్.. మా అసోసియేషన్ నుంచి సస్పెండ్

Published : May 25, 2023, 08:56 PM IST

లేడి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కరాటే కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో జరిగే కార్యక్రమాల్లో కరాటే కళ్యాణి చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది.

PREV
16
కరాటే కళ్యాణికి ఊహించని షాక్.. మా అసోసియేషన్ నుంచి సస్పెండ్

లేడి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కరాటే కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో జరిగే కార్యక్రమాల్లో కరాటే కళ్యాణి చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. అలాగే టివి సీరియల్స్ లో కూడా కరాటే కళ్యాణి నటించింది. ఇదిలా ఉండగా కరాటే కళ్యాణి తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. 

26

ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి గెటప్ లో ఆవిష్కరించనుండడం వివాదంగా మారింది. ఒక వ్యక్తి విగ్రహాన్ని హిందువులు పవిత్రంగా కొలిచే శ్రీకృష్ణుడి గెటప్ లో ఎలా ఆవిష్కరిస్తారు అంటూ యాదవ సంఘాలు కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా స్టే విధించింది. 

36

ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి గెటప్ లో ఏర్పాటు చేయడాన్ని నటి కరాటే కళ్యాణి కూడా తప్పు పడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ ఎవరికి దేవుడు, ఈవర్గానికి ఆయన దేవుడు.. దేని కోసం ఆయన్ని దేవుణ్ణి చేస్తున్నారు. ఒక వ్యక్తిని సాక్షాత్తు శ్రీకృషుడితో పోల్చడం, ఆయన రూపాన్ని ఆపాదించడం ఏంటి అంటూ కరాటే కళ్యాణి ప్రశ్నించారు. 

46

ఎన్టీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మా అసోసియేషన్ ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఇటీవల షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఆ నోటీసులకు ఆమె స్పందించకపోవడంతో కరాటే కళ్యాణి ని మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మా అసోసియేషన్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. 

 

56

తనపై విధించిన సస్పెన్షన్ పై కరాటే కళ్యాణి ఇంకా స్పందించలేదు. కరాటే కళ్యాణి రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటూ బీజేపీలో చేరింది. తరచుగా ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 

66

ఇదిలా ఉండగా ఈ నెల 28న ఖమ్మంలో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

click me!

Recommended Stories