Kangana vs Hrithik : మళ్లీ మొదలైన కంగనా-హృతిక్ రచ్చ.. పాత గొడవ మళ్లీ రిపీట్.. ఏం జరిగిందంటే?

Published : Aug 02, 2026, 11:46 AM IST

Kangana Ranaut vs Hrithik Roshan: వైరల్ ట్రెండ్‌పై హృతిక్ కామెంట్ చేయడంతో కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. తనను టార్గెట్ చేయడం ఆపాలని, తన పార్ట్‌నర్‌ను ఇబ్బంది పెట్టవద్దని హృతిక్‌కు కౌంటర్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
వైరల్ ట్రెండ్‌తో మొదలైన హృతిక్ vs కంగనా వివాదం

బాలీవుడ్‌లో నటి, ఎంపీ కంగనా రనౌత్, హీరో హృతిక్ రోషన్ మధ్య పాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఇటీవల 'వి నీడ్ టు అపోలజైజ్ టు హృతిక్ రోషన్' (We Need to Apologise to Hrithik Roshan) అనే ట్రెండ్ వైరల్ అయింది. విద్యా సంస్కరణలు, విద్యార్థుల ఆందోళనలు, మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలపై కంగనా చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ ట్రెండ్ ప్రారంభమైంది. అయితే, దీనిపై హృతిక్ రోషన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దనీ, నిజానిజాలు తెలిసే వరకు వేచి చూడాలని కామెంట్ చేశారు.

24
హృతిక్ కామెంట్‌కి కంగనా ఘాటు కౌంటర్

హృతిక్ రోషన్ చేసిన కామెంట్‌పై కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా స్పందించారు. తనను వేధిస్తున్న వారిని ఖండించాల్సింది పోయి, తనను హేళన చేయడం సరికాదని మండిపడ్డారు. "ప్రియమైన హృతిక్, నీకు సరైన జోడీ సబా ఆజాద్ లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీరిద్దరూ కలసి చాలా బాగున్నారు. నువ్వు ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నావు. ఇలాంటి సమయంలో ఒక మహిళను హేళన చేయడం నీకు తగదు. నీ పేరు వాడుకుని నన్ను వేధిస్తున్న వారిని నువ్వు ఖండించాలి. నిప్పుకి నెయ్యి పోయడం ఆపు. నీ భాగస్వామిని ఇబ్బంది పెట్టకు" అని కంగనా ఘాటుగా రాసుకొచ్చారు.

34
ఫ్రెడ్డీ బర్డీ పోస్ట్.. హృతిక్ రియాక్షన్

అంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెడ్డీ బర్డీ ఇన్స్టాగ్రామ్‌లో "ప్రపంచం హృతిక్ రోషన్‌కు క్షమాపణలు చెప్పాలి" అని ఒక పోస్ట్ పెట్టారు. దీనికి హృతిక్ స్పందిస్తూ.. "ఒక వ్యక్తి నచ్చలేదు అని మరొకరి వైపు నిలబడటం సమాజంలోని పెద్ద సమస్యలో చిన్న భాగం. సరైన సందర్భం, నిజాలు బయటకు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను" అని కామెంట్ చేశారు.

కాగా, సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్‌తో కంగనాకు జరిగిన మాటల యుద్ధం క్రమంలో.. సౌరవ్ స్నేహితులు అతన్ని "నువ్వు యంగ్ హృతిక్ రోషన్‌లా ఉన్నావు, అందుకే కంగనా నిన్ను టార్గెట్ చేస్తోంది" అని కామెంట్ చేయడంతో ఈ గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది.

44
2016 నాటి పాత గొడవ నేపథ్యం ఇదే

కంగనా, హృతిక్ మధ్య వివాదం 2016లో ప్రారంభమైంది. ఒక ఇంటర్వ్యూలో హృతిక్‌ను కంగనా సిల్లీ ఎక్స్ అని పిలవడంతో వివాదం మొదలైంది. అయితే, తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని హృతిక్ స్పష్టం చేశారు. ఎవరో తన పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి కంగనాకు మెయిల్స్ పంపారని హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కానీ, ఆ ఐడీ హృతిక్ స్వయంగా ఇచ్చారనీ, 2013-2014 మధ్య తాము మెయిల్స్‌లో మాట్లాడుకున్నామని కంగనా వాదించారు. వీరిద్దరూ కలసి 'కైట్స్' (2010), 'క్రిష్ 3' (2013) చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హృతిక్, సబా ఆజాద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. హృతిక్ గతంలో సుసానే ఖాన్‌ను వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు కుమారులు హ్రీహాన్, హ్రిదాన్ ఉన్నారు. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories