Silk Smitha: సిల్క్ స్మిత క్రేజ్, ఆమె మరణం వెనుక ఉన్న షాకింగ్ నిజాలను దర్శకుడు కనగాల జయకుమార్ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవితో షూటింగ్ అనుభవాలు, ఆమె కొరికిన ఆపిల్ వేలంలో రూ. 25 వేలు పలకడం వంటి ఆసక్తికర విషయాలతో పాటు..
ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాల్లో సిల్క్ స్మిత పాట లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనేవారు కాదంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఐటమ్ సాంగ్స్‌కే పరిమితం కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక స్టార్‌డమ్ సృష్టించుకున్న సిల్క్ స్మిత వ్యక్తిత్వం, ఆమె విషాదకర మరణం వెనుక ఉన్న కారణాలను దర్శకుడు కనగాల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
25
ఆమెలోని ఆత్మవిశ్వాసం - 'అప్పటి పుష్ప'
సిల్క్ స్మిత సెట్స్‌లో చాలా ధైర్యంగా, ఎవరికీ తలవంచకుండా ఉండేదని జయకుమార్ తెలిపారు. ఎంత పెద్ద హీరోలు సెట్స్‌లోకి వచ్చినా ఆమె కాళ్ల మీద కాళ్లు వేసుకుని స్టైల్‌గా కూర్చునేదని, ఇది నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తించేదని ఆయన గుర్తు చేసుకున్నారు. అందుకే ఆమెను 'అప్పటి పుష్ప' అని ఆయన అభివర్ణించారు. ఆమె కళ్లలో ఒక మ్యాజిక్ ఉండేదని, క్లోజప్ షాట్లలో ఆమె అందం అద్భుతంగా ఉండేదని ఆయన కొనియాడారు.
35
మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఆసక్తికర ఘటన
ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను జయకుమార్ వివరించారు. దర్శకుడు క్రాంతి కుమార్ సెట్స్‌లో సిల్క్ స్మిత కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చున్నప్పుడు, చిరంజీవి డైలాగ్ చెప్పుకుంటూ ఆమె దగ్గరకు వచ్చే షాట్ ఉంది. ఆ సమయంలో చిరంజీవి ఆమెను కొట్టే సీన్‌లో, కేవలం లైట్ గా టచ్ చేసినా ఆమె ఓవర్ గా రియాక్ట్ అయి కింద పడిపోయిందని, ఆ తర్వాత ఆమెను అనునయించి షాట్ పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న అవమానాల వల్లే ఎవరినీ లెక్క చేయకుండా ఉండే స్వభావం ఆమెలో ఏర్పడిందని ఆయన తెలిపారు.
సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ ఏ హీరోయిన్ కు లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తూ.. ఒక ఫంక్షన్‌లో ఆమె కొరికిన ఆపిల్ ను వేలం వేస్తే ఆ రోజుల్లోనే ఒక అభిమాని రూ. 25,000 పెట్టి కొనుక్కున్నారని జయకుమార్ వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమాలో సిల్క్ స్మిత డాన్స్ ఉందా లేదా అని అడిగి మరీ సినిమాలను కొనేవారని ఆయన తెలిపారు.
55
సినిమా నిర్మాణం, పతనం
సిల్క్ స్మిత జీవితం మలుపు తిరగడానికి ఒక డాక్టర్ తో ఏర్పడిన పరిచయం కారణమని ఆయన పేర్కొన్నారు. ఆమెతో హీరోయిన్ గా సినిమాలు తీయించి, ఆ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయని ఆయన తెలిపారు. దీనివల్ల అప్పటి వరకు ఉన్న క్రేజ్ తగ్గిపోయిందని, ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని ఆయన వివరించారు. చివరికి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఒక భయంకరమైన దృశ్యమని, ఒక గొప్ప నటిని మనం కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సిల్క్ స్మిత మరణం చుట్టూ అనేక ఊహగానాలు ఉన్నప్పటికీ, ఆమె తన జ్ఞాపకాలను, స్టార్‌డమ్‌ను ఇప్పటికీ అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉంచుకుంది. ఆమె జీవితం ఒక వెలుగు వెలిగిన మహారాణి లాంటిదని దర్శకుడు జయకుమార్ గుర్తు చేసుకున్నారు.