Kamal Hasan: కోలుకున్న కమల్ హాసన్.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్.. షూటింగ్ కు సై అంటున్న లోకనాయకుడు

Published : Jan 19, 2022, 11:21 AM ISTUpdated : Jan 19, 2022, 11:22 AM IST

సోమవారం సడెన్ గా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు కమల్ హాసన్(Kamal Hasan). దాంతో ఏం జరుగుతోందో అర్ధం కాక  ఆయన అభిమానులు కంగారు పడ్డారు. కమల్ డిశ్చార్జ్ కావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

PREV
15
Kamal Hasan: కోలుకున్న కమల్ హాసన్..  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్.. షూటింగ్ కు సై అంటున్న లోకనాయకుడు

రీసెంట్ గా కమల్ హాసన్(Kamal Hasan) హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. తమ అభిమాన నటుడికి ఏమయ్యిందా ని కంగారు పడిపోయారు ఫ్యాస్. అయితే ఒక రోజు హాస్పిటల్ లోనే ఉండటంతో.. కమల్ ఆరోగ్యం పై రకరకాల వదంతులు వ్యాపించాయి. కమల్ ఆరోగ్యం పై ఇండస్ట్రీలో ఆరాతియ్యడం మొదలెట్టారు. కాని అసలు నిజం తెలుసుకున్న తరువాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

25

అయితే కమల్(Kamal Hasan) సోమవారం హాస్పిటల్ లో ఎందుకు జాయి అయ్యారు అనేదానిపై టీమ్ నుంచి వివరణ వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసమే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని తెలిసింది. ఒక రోజు హస్పిటల్ లో ఉన్న కమల్.. అన్నిరకాల పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో నిన్న ఉదయం డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు.

35

ఆమధ్య కరోనాతో చెన్నై లోని ఫేమస్ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు కమల్ హాసన్ (Kamal Hasan). చాలా రోజులు కమల్ ఇన్ ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన  చెందారు. ఆతరువాత కమల్ హాసన్ కోలుకుని తిరిగి తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు, రీసెంట్ గా తమిళ బిగ్ బాస్ కూడా ఫైనల్స్ కంప్లీట్ చేశారు. రెగ్యూలర్ షూటింగ్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.

45

అయితే కమల్ హాసన్(Kamal Hasan) కోవిడ్ నుంచి కోలుకుని ఎక్కువ రోజులు అవ్వడం లేదు. దాంతో అన్నీ సెట్ అయ్యాయా.. లేక ఇంకేమనై డిఫెక్ట్ ఉందా అనే కోణంలో పరీక్షలు  చేయించుకున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో ఆయన హాస్పిటల్ కు వెళ్ళారట. కాని ఎటువంటి అనారోగ్యం లేదు అని డాక్టర్స్ చెప్పినట్టు తెలుస్తోంది.

55

ఇక తన రెగ్యూలర్ షూటింగ్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు కమల్ హాసన్(Kamal Hasan). కరోనా జాగ్రత్తులు తీసుకుంటూనే.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కతోన్న విక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దానితో పాటు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతూ.. సగంలో ఆపేసిన భారతీయుడు2 షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు కమల్.

click me!

Recommended Stories