స్టార్‌ హీరోయిన్ల మంగళ సూత్రాలుః కాజల్‌, సమంత, దీపిక, ప్రియాంక, అనుష్కల సూత్రాలు ఎట్రాక్ట్ చేస్తున్న డిజైన్స్

First Published Jul 21, 2021, 2:26 PM IST

హీరోయిన్లు గ్లామర్‌గా కనిపించాలంటే బాడీపై ఎలాంటి నగలు ఉంచుకోకూడదు. అందుకే స్టార్‌ హీరోయిన్లు కాజల్‌, సమంత, దీపికా, ప్రియాంక, ఐశ్వర్య, అనుష్క వర్మ వంటి కథానాయికలు మంగళసూత్రాల సైజ్‌ని తగ్గించారు. ట్రెండ్‌కి కొత్త అర్థాన్నిస్తున్నారు. 
 

హిందూ సాంప్రదాయంలో పెళ్లైన అమ్మాయి మెడలో మంగళసూత్రం కచ్చితంగా ఉండాల్సిందే. పెళ్లి అయ్యిందనే ఫ్రూప్‌ మంగళసూత్రమే. దాన్ని కొందరు పసుపు తాడుతో, మరికొందరు బంగారంతో ధరిస్తారు. ఈ రెండూ మెడపై పెద్దగా కనిపిస్తుంటాయి. అందుకే హీరోయిన్లు నల్లపూసలతో కలిపి మంగళసూత్రాన్నిధరిస్తుంటారు. మెడపై వెయిట్‌ లేకుండా సింపుల్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం మన స్టార్‌ హీరోయిన్లు ధరిస్తున్న మంగళసూత్రాలకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
undefined
గతేడాది తన ప్రియుడు వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. కాజల్‌ సింగిల్ డైమండ్ చైన్‌లాంటి మంగ‌ళ‌సూత్రాన్ని ధ‌రిస్తూనే దాంతో పాటు వ‌జ్రాలు పొద‌గ‌బ‌డ్డ మ‌రో చైన్‌ను పలు మార్లు ధరిస్తుంది.
undefined
తెలుగు స్టార్‌ హీరోయిన్‌ సమంత నాలుగేళ్ల క్రితం నాగచైతన్యని వివాహం చేసుకుంది. ఆమె కొన్ని సందర్భాల్లో పసుపుతాడుతో కనిపించేది. కానీ ఇప్పుడు రెండు లైన్స్ నల్లపూసలు ఉండే చిన్నపాటి మంగళసూత్రాన్ని ధరిస్తుంది.
undefined
సమంత అత్తగారు, నటి అమల రెండు లైన్ల నల్లపూసలతో కూడిన మంగళసూత్రాన్ని ధరిస్తుంది. ఆమె డిజైన్‌ మరింత కొత్తగా ఉండటం విశేషం.
undefined
బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా మంగళసూత్రం ధరించడం విశేషం. ఆమె అమెరికన్‌ సింగర్‌ నిక్‌జోనాస్‌ని మూడేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అయితే అక్కడ మంగళసూత్రాన్ని వాడరు. కానీ ప్రియాంక మన ఇండియన్‌ సంప్రాదాయాల్నిఫాలో అవుతుంది. ప్ర‌త్యేకంగా డిజైన్ చేయ‌బ‌డ్డ మంగ‌ళ‌సూత్రాన్ని ధ‌రిస్తుంది. పెళ్లైన కొత్త‌లో డైమండ్స్‌తో పాటు న‌ల్ల‌, బంగారు పూస‌లు కూడా పొద‌గ‌బ‌డి ఉన్న మంగళసూత్రాన్ని ధరించింది.
undefined
దీపికా పదుకొనె బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. ఆమె హీరో రణ్‌వీర్‌ సింగ్‌ని వివాహం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతోపాటు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూ రాణిస్తున్న దీపికా సింగిల్ డైమండ్ చైన్‌లాంటి మంగ‌ళ‌సూత్రాన్ని ధ‌రిస్తుంది.
undefined
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సంప్రదాయ‌కంగా ఉండే మంగ‌ళ‌సూత్రాన్ని ధ‌రిస్తుంది. సున్నిత‌మైన, అంద‌మైన డిజైనింగ్‌లో ఈ మంగ‌ళ‌సూత్రం ఉండటం విశేషం.
undefined
బాలీవుడ్ న‌టుడు అనీల్ క‌పూర్ త‌న‌య‌, హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ సైతం సింపుల్‌గా, ట్రెండీగా ఉండే మంగళసూత్రాన్ని ధరిస్తుంది. ఆమె మూడేళ్ల క్రితం వ్యాపార‌వేత్త అయిన ఆనంద్ అహూజాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సింగిల్ డైమండ్ చైన్ మంగ‌ళ సూత్రాన్ని ధ‌రించిన‌ప్ప‌టికీ అందులో ఆనంద్ ఆహూజా రాశి గుర్తు ఉండేలా డిజైన్ చేసుకుని ధరించ‌డం విశేషంగా చెప్పుకోవచ్చు.
undefined
తెలుగులో నితిన్‌తో `కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌` చిత్రంలో మెరిసిన యామీ గౌతమీ ఇటీవల కరోనా సమయంలో సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకుంది. ఆమె వివాహం, డ్రెస్సింగ్‌పై ఆ మధ్య వివాదం అయ్యింది. ఆమె దర్శకుడు ఆదిత్య ధార్‌ని వివాహం చేసుకోగా, పెండెంట్‌ని పోలిన మంగళసూత్రాన్ని ధరిస్తుంది.
undefined
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌ అభిషేక్‌ బచ్చన్‌ని వివాహం చేసుకుంది. ఆమె నల్లపూసలను పోలిన చైన్‌లో పెండెంట్‌ ఉండేలా డిజైన్‌ చేయబడ్డ మంగళసూత్రాన్ని ధరిస్తుంది.
undefined
ఇక ప్రస్తుతం నీలి చిత్రాల కేసులో అరెస్ట్ కాబడ్డ రాజ్‌కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టి నల్లపూసలతో కూడిన లక్ష్మీ తాళి డిజైన్‌ని ధరిస్తుంది.
undefined
click me!