కాజల్‌ క్యూట్‌ లుక్స్ మైండ్‌ బ్లాక్‌ .. ఇంతటి అందాన్ని చూస్తే కుర్రాళ్లంతా ఏమైపోతారో! నెట్టింట రచ్చే

Published : Nov 18, 2022, 04:49 PM ISTUpdated : Nov 18, 2022, 08:00 PM IST

కాజల్‌ అగర్వాల్‌ తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని పొందిన హీరోయిన్‌. పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్‌ ఏమాత్రం తరగలేదని నిరూపించుకుంది. మరింత క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా నయా పిక్స్ తో కట్టిపడేస్తుంది.   

PREV
17
కాజల్‌ క్యూట్‌ లుక్స్ మైండ్‌ బ్లాక్‌ ..  ఇంతటి అందాన్ని చూస్తే కుర్రాళ్లంతా ఏమైపోతారో! నెట్టింట రచ్చే

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌(Kajal) లేటెస్ట్ గా తన ఫోటోలను పంచుకుంది. ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తుంది కాజల్‌. స్లీవ్‌ లెస్‌ కుర్తా ధరించి చిలిపి పోజులిచ్చింది. ముసి ముసినవ్వులు నవ్వుతూ, ఇంకాస్త సిగ్గులొలికిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది కాజల్‌. ప్రస్తుతం ఇవి అభిమానులను,నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. 
 

27

ఇందులో kajal ట్రెడిషనల్‌ లుక్‌లో మెరవడం విశేషం. ఇందులో ఆమె అందం మరింత పెరిగింది. మరింత క్యూట్‌గానూ మారిపోయింది. అందుకే తెగ ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని కట్టిపడేస్తుంది. దీంతో కాజల్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాజల్‌(Kajal Photos) ఇంతటి క్యూట్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఆమె అందానికి ముగ్దులవుతున్నారు. 

37

కాజల్‌ అగర్వాల్‌ కొంత గ్యాప్‌తో మరోసారి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఆమె తన కుమారుడు నీల్‌ కిచ్లుకి జన్మనిచ్చిన కొద్ది రోజుల్లోనే ఫ్రీ అయిపోయింది. ఫోటో షూట్లతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హాట్‌ ఫోటో షూట్లతో కనువిందు చేసింది. తన హాట్ అందాలతో తన గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని చాటుకుంది. 
 

47

వరుసగా ఫోటో షూట్లతో అలరించింది. దీంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు కాజల్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని భావించారు. హాట్‌గా, ఘాటుగా, క్యూట్‌గా ఫోటో షూట్‌ పిక్స్ షేర్‌ చేయడంతో కాజల్‌ రీఎంట్రీ గట్టిగానే ఉండబోతుందని అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదని తెలుస్తుంది. 

57

పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత హీరోయిన్లని రిసీవ్‌ చేసుకునే కల్చర్‌ మన తెలుగు ఇండస్ట్రీలో ఉందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బాలీవుడ్‌లో కరీనా కపూర్‌ లాంటి హీరోయిన్లు తమ సత్తాని చాటారు. కానీ టాలీవుడ్‌లో ఇదొక ప్రయోగమనే చెప్పాలి. మరి ఈ విషయంలో కాజల్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి. 
 

67

కాజల్‌ ప్రస్తుతం `ఇండియన్‌ 2`లో నటించాల్సి ఉంది. ఇది పెళ్లికి ముందే ఒప్పుకున్న విషయం తెలిసిందే. తన కమిట్‌మెంట్‌ని పూర్తి చేయనుంది. ఈ సినిమా ఆ మధ్య తిరిగి షూటింగ్‌ ప్రారంభమైంది. కాజల్‌ కూడా పాల్గొనబోతుందని సమాచారం. 
 

77

మరోవైపు ప్రస్తుతం కాజల్‌ ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఓ వైపు తల్లిగా, మరోవైపు భార్యగా, ఇంకోవైపు వ్యాపారవేత్తగానూ మారిపోయింది. మూడింటిని బ్యాలెన్స్ చేస్తుంది. మళ్లీ నటిగా పుంజుకుంటే జీవితంలో అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్లే అరుదైన నటిగా కాజల్‌ నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి కాజల్‌ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories