మేకప్‌ రూమ్‌లో కాజల్‌ క్యూట్‌ పోజు.. వీడియో కాల్‌లో కొడుకు నీల్‌ కిచ్లుతో.. బాగా మిస్‌ అవుతున్నానంటూ పోస్ట్..

Aithagoni Raju | Updated : Oct 06 2023, 08:14 PM IST
Google News Follow Us

తెలుగు అందాల చందమామ కాజల్‌.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చందమామ లాంటి అందం పోయి హాట్‌ బ్యూటీలా మారింది. అసలు సెగలు ఇప్పుడే రేపుతుంది. 
 

17
మేకప్‌ రూమ్‌లో కాజల్‌ క్యూట్‌ పోజు.. వీడియో కాల్‌లో కొడుకు నీల్‌ కిచ్లుతో.. బాగా మిస్‌ అవుతున్నానంటూ పోస్ట్..

కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్‌లో రచ్చ చేసేందుకు వస్తుంది. ఈ నెల నుంచి ఈ అమ్మడి సందడి ప్రారంభం కాబోతుంది. వెండితెరపై కాజల్‌ కనిపించి దాదాపు రెండేళ్లు అవుతుంది. మంచు విష్ణు కి సిస్టర్‌గా `మోసగాళ్లు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. 
 

27

ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్‌ కావడంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. నాగార్జునతో నటించాల్సిన `ది ఘోస్ట్` చిత్రం నుంచి తప్పుకుంది. చిరంజీవితో నటించిన `ఆచార్య` చిత్రంలో ఆమె పాత్రని తొలగించారు. దీంతో ఆమె అభిమానులు కాజల్‌ని చాలా మిస్‌ అవుతున్నారు. 

37

ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉంది కాజల్‌. తెలుగులో బాలయ్యతో `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తుంది. మొదటిసారి బాలకృష్ణతో కలిసి నటిస్తుంది. ఈ నెల 19న దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సెకండ్‌ ఇన్నింగ్స్ లో మొదటిసారి కనిపించబోతుందని చెప్పొచ్చు. 
 

Related Articles

47

దీంతోపాటు `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. మరోవైపు మొదటి సారి లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది కాజల్‌. `సత్యభామ` అనే చిత్రంలో నటిస్తుంది. ఆ మధ్య ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో కాజల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తుంది. ఆమె నేరస్తులను కొట్టిన తీరు వాహ్‌ అనిపించేలా ఉంది. చిన్న క్లిప్‌తో సినిమాపై అంచనాలు పెంచేసింది కాజల్. 
 

57

తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో కాజల్‌ పాల్గొంటుంది. శరవేగంగా ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. సినిమా షూటింగ్‌ లొకేషన్‌ ఫోటోలను పంచుకుంది కాజల్‌. మేకప్‌ రూమ్‌లో ఆమె చిలిపి పోజులిస్తూ క్యూట్‌గా ఆకట్టుకుంటుంది. ఆమె నయా లుక్‌ ఆకట్టుకుంటుంది. 

67

ఇందులో షూటింగ్‌ సెట్‌ పిక్స్ ని పంచుకుంది. అలాగే తన పేరుతో ఉన్న కప్‌లో కాఫీ తాగుతూ కనిపించింది. మరోవైపు తన కుమారుడిని చాలా మిస్‌ అవుతుందట. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంది కాజల్‌. 
 

77

ఆమె తన కొడుకు నీల్‌ కిచ్లుతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న ఫోటోని పంచుకుంది. ఈ సందర్భంగా తన కొడుకుని చాలా మిస్‌ అవుతున్నట్టు చెప్పింది కాజల్‌. కొడుకుని ఇంటి వద్ద వదిలేసి షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇది ఏ తల్లికైనా మేజర్‌ మిస్సింగ్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos