స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా తన ఫేవరెట్ హీరో ఎవరో తెలియజేసింది. టాలీవుడ్ లో తనకు ఎంతగానో నచ్చిన నటుడు ఆయనే అని నిర్మోహమాటంగా చెప్పింది.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అసవరం లేదు. కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మ తెలుగువారిని అలరిస్తూనే వస్తోంది.
36
తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా హీరోలందరితో నటించి మెప్పించింది. ప్రభాస్ (Prabhas), మహేశ్ బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్స్ సరసన నటించి మంచి ప్రశంసలు అందుకుంది.
46
‘లక్ష్మీ కళ్యాణం’, ‘మగధీర’, ‘డార్లింగ్’, ‘బృందావనం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘బాద్షా’, ‘టెంపర్’ వంటి గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది.
56
అయితే.... దాదాపు తెలుగులో టాప్ స్టార్స్ సరసన నటించిన కాజల్ తాజాగా తన ఫేవరెట్ హీరో ఎవరో తెలియజేసింది. ఆయనెవరో కాదు యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) అని చెప్పింది. ఆయనతో నటించడమంటే చాలా ఇష్టమంట.
66
ఇక తమిళంలో విజయ్ దళపతి తన ఫేవరెట్ హీరో అని నిర్మోహమాటంగా తెలియజేసింది. అయితే కాజల్ ఆన్సర్ పలువురు స్టార్స్ అభిమానులను అప్సెట్ చేసిందని తెలసింది. ఏదేమైనా కాజల్ ముక్కుసూటిగా ఇచ్చిన ఆన్సర్ ఆసక్తికరంగా మారింది.