Karthika Deepam: జ్వాలను పెళ్లి చేసుకోవాలంటూ నిరుపమ్ దగ్గర ప్రామిస్ తీసుకున్న హిమ.. షాక్ లో శౌర్య?

Published : Jun 10, 2022, 07:59 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కథ సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Karthika Deepam: జ్వాలను పెళ్లి చేసుకోవాలంటూ నిరుపమ్ దగ్గర ప్రామిస్ తీసుకున్న హిమ.. షాక్ లో శౌర్య?

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నిరుపమ్ (Nirupam) హిమకు ఎం కాదు హిమ (Hima) ను నేను రక్షించుకుంటాను అని అనుకుంటాడు. మరోవైపు జ్యోతిష్యుడు జ్వాల చేయు చూస్తే నాకు మతి పోతుంది అమ్మా అని అంటాడు. ఈలోపు అక్కడకు శోభ వచ్చి ఆఖరికి జాతకం చెప్పించుకుంటున్నావా? అని అంటుంది.
 

27

ఇక నీ జాతకం నేను చెప్తాను అని చెప్పి.. శోభ (Sobha) నీకు లైఫ్ ఉండదు..  లవ్వు ఉండదు అని జ్వాల (Jwala)  తో అంటుంది. ఆ జ్యోతిష్యుడు అవన్నీ అబద్ధాలే నీకు ఐశ్వర్యం ఉంటుంది. లవ్ కూడా ఉంటుంది అని చెబుతాడు. జ్వాల అతడు చెప్పిన మాటలు వింటుంటే.. నీకు కడుపు మండుతుంది అని అంటుంది.
 

37

ఇక జ్వాల (Jwala) చేతి మీద హెచ్ అనే అక్షరం చూసిన శోభ (Sobha) దాని వివరాలు అడుగుతుంది. అది నా శత్రువు పేరు అని జ్వాల చెబుతుంది. ఆ తర్వాత నిరుపమ్ జ్వాల లు రెస్టారెంట్ దగ్గర కలుసుకుంటారు. ఇక జ్వాల మీ అమ్మ మీద ప్రేమ పెంచుకోండి కానీ మీ జీవితానికి సంబంధించిన విషయాల్లో మీరే నిర్ణయం తీసుకోండి అంటుంది.
 

47

మీ కొంచెం మంచి తనం ఎక్కువ కాబట్టి.. మీరు ఇలా వెనకాముందు అవుతున్నారు అని జ్వాల (Jwala) నిరుపమ్ (Nirupam) తో అంటుంది. ఇక మేడం నన్ను తిట్టినా నేను పడతాను మీ మమ్మీ నే కదా అంటుంది. ఆ క్రమంలో నిరుపమ్ హిమ కు సంబంధించిన విషయాలు జ్వాల కు చెప్పనక్కర్లేదు అని ఆలోచిస్తాడు.
 

57

మరోవైపు సౌందర్య (Soundarya) దంపతులు హిమ కు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఇక ఏం మాట్లాడతామ్ అని అనుకుంటారు. నిరూపమ్ (Nirupam) అందరి ముందు ఈరోజు నుంచి హిమకు అన్ని సేవలు నేనే చేస్తాను అని అంటాడు. ఒక భర్తగా అంటాడు. దాంతో ఫ్యామిలీ మొత్తం స్టన్ అవుతారు. 
 

67

ఇక హిమ (Hima) ను ఒక పసిపాప లా చూసుకుంటాను అని అంటాడు. ఇక ఆ మాటలు విన్న స్వప్న (Swapna) దంపతులు అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతారు. హిమ క్యాన్సర్ నాటకం ఆడి.. సౌర్య బావలను కలుపుదాం అనుకుంటే? బావకు నా పైన మరింత ప్రేమ కలుగుతుంది ఏమిటి? అని ఆలోచిస్తుంది.
 

77

ఇక తరువాయి భాగం లో వేరే అమ్మాయిలో నువ్వు నా ప్రేమను చూసుకోవాలి బావ అని హిమ (Hima) నిరుపన్ ను అడుగుతుంది. ఆ అమ్మాయి ఎవరు అని నిరూపమ్ (Nirupam) కోపంగా అడుగుతాడు. ఈ క్రమంలో హిమ నిరూపమ్ దగ్గర చేతిలో చెయ్యేసి మాట తీసుకొని..  జ్వాలా అని చెబుతోంది. ఇక ఈ విషయాన్ని దూరం నుంచి శోభ కూడా వింటుంది.

click me!

Recommended Stories