ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ.. సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ తోపులాట, ఫొటోస్

First Published May 28, 2023, 9:07 AM IST

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. శతజయంతి సందర్భంగా అభిమానులు, తారలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

నందమూరి వరుసగా ఎన్టీఆర్ ఘాట్ ని దర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ ఉదయమే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పాలతో నివాళులు అర్పించారు. తన తండ్రి శతజయంతి సందర్భంగా బాలయ్య ఆయన్ని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచం మొత్తం తెలుగువారు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

ఆయన సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో సైతం సత్తా చాటారు. తనని అభిమానించిన తెలుగువారి రుణం తీర్చుకోవడం కోసం నాన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, నిర్ణయాలు చారిత్రాత్మకంగా నిలిచాయి. జాతీయ రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రభావం చూపించారు. ఆయన కుమారుడిగ్గా జన్మించడం నా అదృష్టం అని బాలయ్య అన్నారు. 

అనంతరం జూ. ఎన్టీఆర్ కూడా తన తాతగారికి నివాళులు అర్పించారు. జూ.ఎన్టీఆర్ రావడంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనితో అక్కడ కాస్త తోపులాట జరిగింది. అభిమానుల తోపులాట లోనే తారక్ నివాళులు అర్పించి వెళ్లారు. ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. 

అలాగే నందమూరి రామకృష్ణ, పురందేశ్వరి, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తారక్.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకకలు హాజరు కాకపోవడంతో పెద్ద చర్చే జరుగుతోంది. 

   ఇప్పటికే నందమూరి ఫ్యామిలిలో తారక్ కి సరైన ప్రాధాన్యత లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజకీయ ఉద్దేశంతోనే తారక్ ని దూరం పెడుతున్నారు అనే కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలయ్య ఫ్యాన్స్ అయితే ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు.   

click me!