ఆగష్టు 15న జియో హాట్ స్టార్ బంపర్ ఆఫర్, రోజంతా పండగ చేసుకోవచ్చు.. తప్పక చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే

Published : Aug 14, 2025, 11:36 AM ISTUpdated : Aug 14, 2025, 11:38 AM IST

ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జియో హాట్ స్టార్ ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో హాట్ స్టార్ ఇచ్చిన ఈ ఆఫర్ తో ప్రేక్షకులు ఆగష్టు 15న రోజంతా పండగ చేసుకోవచ్చు. 

PREV
15
గుడ్ న్యూస్ చెప్పిన జియో హాట్ స్టార్

దేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న ఈ సమయంలో, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ దేశభక్తిని రగిలించే విధంగా ‘ఆపరేషన్ తిరంగ’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. “తిరంగ ఒక్కటే, కథలు అనేకం” అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ కార్యక్రమం ద్వారా ఓటీటీ ప్రేక్షకులకు జియో హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది.

25
ఆగస్టు 15న పూర్తిగా ఉచిత ప్రసారం

ఈ కార్యక్రమంలో భాగంగా, ఆగస్ట్ 15న జియోహాట్‌స్టార్ తన మొత్తం కంటెంట్ రోజంతా ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సులభంగా, అందుబాటులో ఉండే వినోదాన్ని అందించాలన్నది జియో హాట్ స్టార్ లక్ష్యం. జియో హాట్ స్టార్ అందించిన ఈ అవకాశంతో ఆగష్టు 15న ఓటీటీ ప్రేక్షకులు దేశభక్తికి సంబంధించిన చిత్రాలు, వెబ్ సిరీస్ లతో పాటు ఇతర వినోదాత్మక చిత్రాలని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు కంటెంట్ మొత్తం ఉచితంగా చూడొచ్చు. 

35
తప్పక చూడాల్సిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు  

ఆపరేషన్ తిరంగా లో భాగంగా జియో హాట్ స్టార్ ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి, ఇండియన్ ఆర్మీ, స్పై చిత్రాలని ప్రమోట్ చేస్తోంది. త్రివర్ణ పతాకం రంగుల ఆధారంగా ఈ కథలు విభజించబడ్డాయి. ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రాలని, వెబ్ సిరీస్ లని మిస్ కాకుండా చూడాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కేసరి, కేసరి 2, మద్రాస్ కేఫ్, ఐబీ71, నీర్జా, మంగళ్ పాండే, చంద్రశేఖర్ లాంటి చిత్రాలు ఆగష్టు 15న జియో హాట్ స్టార్ లో మిస్ కాకండా చూడాల్సినవి. ఇటీవల విడుదలై దేశభక్తి, స్పై యాక్షన్ వెబ్ సిరీస్ లు కూడా దుమ్ము లేపుతున్నాయి. స్పెషల్ ఆప్స్ 2, సలాకార్ లాంటి సిరీస్ లు ఆగష్టు 15న స్పై యాక్షన్ వినోదాన్ని అందిస్తూనే దేశభక్తిని కలిగిస్తాయి. 

45
మా లక్ష్యం అదే 

జియోస్టార్ బ్రాండ్ అండ్ క్రియేటివ్ హెడ్ మినాక్షి ఆచన్ మాట్లాడుతూ, “వీక్షకులు ఎప్పుడు, ఎలా చూడాలో స్వేచ్ఛ కల్పించడమే మా లక్ష్యం. ఆపరేషన్ తిరంగ ద్వారా స్వాతంత్ర దినోత్సవవేడుకల్ని జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆటంకం లేకుండా కథలను అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.

55
ఇతర చిత్రాలు 

దేశభక్తి చిత్రాలు కాకుండా ఇతర చిత్రాలు కూడా జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. 12th ఫెయిల్, టూరిస్ట్ ఫ్యామిలీ, తుడరం, రోన్త్, డీఎంఏ లాంటి చిత్రాలని జియో హాట్ లో చూడొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories