బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ అవతరించింది. ఆమె కెప్టెన్ ఎలా అయింది ? వర్షిణి,స్ షాలిని మధ్య జరిగిన గొడవ ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
బిగ్ బాస్ తెలుగు 10లో హౌస్ కి మొదటి కెప్టెన్ ఎంపికయ్యారు. రైతు బిడ్డ ఝాన్సీకి హౌస్ మొట్ట మొదటి కెప్టెన్ గా అవకాశం దక్కింది. శుక్రవారం హౌస్ లో 12 వ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్కుల్లో ఝాన్సీ విజయం సాధించి మొదటి కెప్టెన్ గా అవతరించింది. కెప్టెన్సీ టాస్కులు ఎలా జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
25
కెప్టెన్సీ టాస్క్
కెప్టెన్సీ కంటెండర్స్ గా ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఈ ఐదుగురు జైల్లో ఉంటారు. దానికి మిగిలిన సభ్యులు గార్డ్స్ గా ఉంటారు. గాడ్స్ ని కంట్రోల్ చేసే వారీగా వంశీ, రోహిత్ వ్యవహరించారు. జైలు గేట్లు తెరిచినప్పుడు ఈ ఐదుగురు తప్పించుకుని గోడ దూకి సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి. ఆ క్రమంలో గాడ్స్ తమకి నచ్చని లేదా కెప్టెన్ కాకూడదు అని భావించే కంటెండర్ ని అడ్డుకోవచ్చు.
35
నీకు ఏజ్, అనుభవం లేదు
ఒక్కో రౌండ్ లో ఏ కంటెండర్ అయితే గోడ దూకకుండా గాడ్స్ కి చిక్కుతారో వాళ్ళు టాస్క్ నుంచి అవుట్ అవుతారు. గాడ్స్ రెండు గ్రూపులుగా విడిపోయారు. వర్షిణి, నరేష్, దేబ్జానీ లాంటి వాళ్ళు షాలినిని టార్గెట్ చేశారు. రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్ ముందుగా గోడ దూకేశారు. ఝాన్సీ ని కూడా అడ్డుకున్నారు. కానీ షాలినిని అడ్డుకునే క్రమంలో ఝాన్సీని వదిలేశారు. వర్షిణి.. షాలినితో చెబుతూ రామ్ ప్రసాద్ గారు కెప్టెన్ కావాలనేది మా కోరిక. నీకు పెద్ద ఏజ్ కూడా లేదు. అనుభవం లేదు. అందుకే అడ్డుకుంటున్నాం అని వర్షిణి తెలిపింది. మొత్తానికి షాలిని తొలి రౌండ్ లోనే అవుట్ అయింది. దీనితో షాలినికి వర్షిణిపై కోపం కట్టలు తెంచుకుంది. ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్లే కెప్టెన్ కావాలి అనే రూల్ ఉందా.. అయితే ఈ గేమ్స్ అంతా ఎందుకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ట్రోఫీ కూడా ఇచ్చేయండి. అసలు నువ్వు నా ఏజ్ ని ఎందుకు మధ్యలో తీసుకువచ్చావ్ అంటూ షాలిని ఒక రేంజ్ లో రెచ్చిపోయింది.
నేను కెప్టెన్ కావడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి. ఎలా ఏజ్ గురించి మాట్లాడి బొక్కలో పాయింట్స్ అన్నీ చెప్పకూడదు అంటూ షాలిని వర్షిణిపై రెచ్చిపోయింది. ఆ తర్వాత రౌండ్ లో గాడ్స్ ముఖేష్ ని అడ్డుకున్నారు. ఆ తర్వాత త్రిగుణ్ కూడా అవుట్ అయ్యాడు. మొత్తంగా ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్, ఝాన్సీ విజేతలు అయ్యారు.
55
ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
కెప్టెన్సీ టాస్క్ లో చివరి రౌండ్ రామ్ ప్రసాద్, ఝాన్సీ మధ్య జరిగింది. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం కట్టర్ తో ఫెన్సింగ్ ని కట్ చేసి అవతలకు చేరుకొని కెప్టెన్సీ జెండాని ఎగరేయాలి. అలా ఎవరు చేస్తే వాళ్లే బిగ్ బాస్ తెలుగు 10లో తొలి కెప్టెన్. ఈ టాస్క్ ని ముందుగా పూర్తి చేసిన ఝాన్సీ సీజన్ 10 తొలి కెప్టెన్ గా అవతరించారు. దీనితో బిగ్ బాస్ ఆమెకి అభినందనలు తెలిపి హౌస్ లో ప్రత్యేక గదిని కేటాయించారు.