రివల్యూషనరీ లీడర్‌ `తలైవి` వర్కింగ్‌ స్టిల్స్.. జయ పాత్రలో కంగనాని చూస్తే వాహ్‌ అనాల్సిందే..

Published : Dec 05, 2020, 01:43 PM IST

కోలీవుడ్‌ సినిమాలోనే కాదు, తమిళ రాజకీయాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన తిరుగులేని నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌ `తలైవి`లో కంగనా ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాజాగా జయలలిత వర్ణంతి సందర్భంగా ఈ చిత్రం వర్కింగ్‌ స్టిల్స్ ని పంచుకుంది కంగనా.   

PREV
113
రివల్యూషనరీ లీడర్‌ `తలైవి` వర్కింగ్‌ స్టిల్స్.. జయ పాత్రలో కంగనాని చూస్తే వాహ్‌ అనాల్సిందే..
జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` పేరుతో బయోపిక్‌ని దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ రూపొందిస్తున్నారు. ఇందులో జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తుంది. ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటిస్తున్నారు.

213
ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. తాజాగా శనివారం జయలలిత వర్ణంతి సందర్భాన్ని పురస్కరించుకుని `తలైవి` చిత్రంలోని వర్కింగ్‌ స్టిల్స్ ని పంచుకున్నారు.

313
ఇందులో కంగనా అసెంబ్లీకి వస్తున్న ఫోటో, అలాగే ఎమ్మెల్యేలతో ఉన్న ఫోటోతోపాటు స్కూల్‌ విద్యార్థులకు భోజనాలు పెడుతున్న ఫోటోని పంచుకున్నారు.

413
ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జయలలిత పాత్రలో కంగనా పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఉంది. ఈ సందర్భంగా రివల్యూషనరీ లీడర్‌ జయమ్మ వర్ణంతి సందర్భంగా పలు వర్కింగ్‌ స్టిల్స్ అంటూ ఈ ఫోటోలను పంచుకుంది కంగనా. అందుకు తన టీమ్‌కి ధన్యవాదాలు తెలిపింది.

513
సినిమాని శరవేగంగా పూర్తి చేసేందుకు సూపర్‌ హ్యుమన్‌గా మారి వర్క్ చేస్తున్నట్టు తెలిపింది. వారంలో షూటింగ్‌ పూర్తవుతుందని తెలిపింది.

613
ఇటీవలే కరోనా తర్వాత తిరిగి షూటింగ్‌ ప్రారంభించినప్పుడు మరికొన్ని ఫోటోలు పంచుకుంది కంగనా.

713
ఆ మధ్య `తలైవి` సినిమా గురించి స్పందిస్తూ, తాను నటిస్తున్న తొలి సూపర్‌ హ్యూమన్‌ గర్ల బయోపిక్‌ అని తెలిపింది. ఈ సినిమా కోసం ఇరవై కేజీలు బరువు పెరిగినట్టు తెలిపింది.

813
ఇందులో అసలైన జయలలిత ఫోటోతోపాటు అసెంబ్లీలో ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇవి తెగ వైరల్‌ అయ్యాయి.

913
దీంతోపాటు భారతనాట్యం నేర్చుకుంది. ఆ సమయంలో బరువు తగ్గినట్టు పేర్కొంది. ఆమె భారతనాట్యం చేస్తున్న ఫోటోలు సైతం ఆ మధ్య సోషల్‌ మీడియాలో సందడి చేశాయి.

1013
రివల్యూషనరీ లీడర్‌గా పేరుతెచ్చుకున్న జయలలిత పాత్రలో కంగనా నటిస్తుండటంతో సినిమాకి మరింత క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

1113
ఇక కంగనా రనౌత్‌ పేరు చెబితే బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ అనేది ముందుగా గుర్తొస్తుంది. ఆమె సుశాంత్‌ సింగ్‌రాజ్‌ పుత్‌ కేసులో బాలీవుడ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నెపోటిజం, బాలీవుడ్‌లో డ్రగ్స్ వంటి వాటిపై బోల్డ్ కామెంట్‌ చేశారు.

1213
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆమె విరుచుపడ్డారు. ఒకానొక దశలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఓ చిన్నపాటి యుద్ధమే చేసింది కంగనా. దీంతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు.

1313
తాజాగా తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై కూడా కంగనా స్పందించింది. కాంగ్రెస్‌ని ఉద్దేశించి ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం కంగనా `తలైవి`తోపాటు `దాఖడ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories