టాప్ గ్లామర్ తో జాన్వీ కపూర్ రచ్చ.. మెరిసిపోయే అందంతో మతులు పోగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్

First Published | Oct 7, 2023, 12:58 PM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. టాప్ అందాలతో మంత్రముగ్ధులను చేసేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. కుర్ర హీరోయిన్ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘ధడక్’ చిత్రంతో వెండితెరపై మెరిసింది. అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. తన పెర్ఫామెన్స్ విషయంలో సినిమా సినిమాకు మెరుగవుతూ వస్తోంది. 
 

సినిమాల విషయంలో ఏమాత్రం జాన్వీ తొందరపడటం లేదు. తను పాత్రకు న్యాయం చేయగలిగే రోల్స్ లోనే నటిస్తూ మెప్పిస్తోంది. నిదానంగా కెరీర్ లో స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంటోంది. ఆమె ఎంట్రీనే గ్రాండ్ గా ఉన్నప్పటికీ ఏమాత్రం తొందరపడకుండా ఆచీతూచీ అడుగులేస్తోంది.
 


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ  హిందీలో సినిమాలు చేస్తూనే ఇటు సౌత్ పైనా ద‌ృష్టి పెట్టింది. ముఖ్యంగా జాన్వీ కపూర్ టాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన ‘దేవర’ (Devara) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోనుంది.
 

తెలుగులో  జాన్వీకి మరిన్ని ఆఫర్లు అందుతున్నాయని సమాచారం. దీంతో ఇక్కడే రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ ఇంటిని కూడా ఖరీదు చేసిందంట. అంటే కొన్నాళ్లు ఇక్కడే సందడి చేయబోతోందని అర్థం అవుతోంది. ఈక్రమంలో సోషల్ మీడియాలోనూ మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 

నెట్టింట జాన్వీ కపూర్ ఎప్పుడో గ్లామర్ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిగ్ స్టార్స్ తో నటిస్తున్న సందర్భంగా అతి అందాల విందుకు తెర దించి స్టన్నింగ్ గా దర్శనమిస్తోంది. తన రూపసౌందర్యం, ఫ్యాషన్ సెన్స్ తో, క్యూట్ ఫోజులతో అట్రాక్ట్ చేస్తోంది. 

తాజాగా లైట్ గ్రీన్ డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్, స్ట్రిప్ లెస్ అవుట్ ఫిట్ టాప్ గ్లామర్ షో చేసింది. మెరిసిపోయే చర్మసౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. క్లోజప్ షాట్స్ లో మత్తుగా ఫోజులిస్తూ మతులు పోగొట్టింది. లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక జాన్వీ ‘మిస్టర్ అండ్ మిస్ మహి’, ‘ఉల్జాహ్’ చిత్రాల్లోనూ నటిస్తోంది.
 

Latest Videos

click me!