అల్లు అర్జున్ నువ్వేమైన పుడింగి వా.. జనసేన ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..

మెగా ‌- అల్లు వివాదం ముదిరి పాకాన పడుతోంది. అటు బన్నీ.. ఇటు పవన్ టీమ్.. ఎవరు తగ్గేదేలేదంటున్నారు. తాజాగా బన్నీపై ఘాటు విమర్షలు చేశారు జనసేన ఎమ్మెల్యే. 
 

అల్లు అర్జున్ పై మండి పడ్డారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఆయనకు ఫ్యాన్స్ లేదరని.. ఉన్నా కూడా వాళ్లు మెగా ఫ్యాన్స్ మాత్రమే అని.. నాకు ఫ్యాన్స్ ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నారేమో..?ఆయనకి ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే అని అన్నారు. అల్లు అర్జున్ స్థాయి మరచి మాట్లాడుతున్నాడు. నువ్వు వస్తే ఏంటి... రాకపోతే ‌ఏంటి.21 స్థానాల్లో పోటీ చేసి మొత్తం గెలిచాం.. మీ నాన్న ఎంపీగా పోటీ చేస్తే నువ్వు గెలిపించలేకపోయావు. మెగా ప్యామిలీ నుంచి బయటకు వచ్చి పుడింగిని అనుకుంటున్నావేమో.. మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లడాలి అని జనసేన ఎమ్మెల్యే ఘాటు విమర్షలు చేశారు. 
 

ప్రస్తుతం మెగా, అల్లు  వివాదం చిలికి చిలిక తుఫానుగా మారింది. ఎవరు తగ్గడంలేదు. పవర్ కళ్యాణ్ విషయంలో బన్నీ చేసిన పోరపాటకు. ఆయనపై గట్టిగా ట్రోలింగ్ జరిగింది.. ఇక అప్పటి నుంచి చిన్నగా నిప్పు రాజేసుకుని.. అది పెద్ద మంటగా మారుతోంది. ఇక మెగా అభిమానులకు, అల్లు అభిమానులకు మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమంటోన్న సంగతి తెలిసిందే. ఈ మంటకు రోజు ఎవరో ఒకరు ఆధ్యం పోస్తూనే ఉన్నారు. 


Chiranjeevi

ఈ ఏడాది జరిగిన  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ‌- జగన్ మధ్య ఎంత వైరం నడిచిందో తెలుసిందే. పక్కాగా గెలవాలని మెగా ప్యామిలీ అంతా బయటకు వచ్చి పవన్ కు సపోర్ట్ గా ప్రచారం చేశారు. కాని అటు మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ మాత్రం ఫ్రెండ్షిప్ పేరుతో  వైసీపీ తరఫున నంద్యాల నుంచి పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు.  బన్నీ స్వయంగా సతీసమేతంగా  నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు. 
 

ఇక అప్పుడు పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ విజయం కోసం మెగా కుటుంబ సభ్యులంతా ప్రచారం చేశారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. బన్నీ మాత్రం పవన్ గెలవాలని కోరుకుంటూ ఓ ట్వీట్  వేసి సరిపెట్టారు. ఇది మెగా అభిమానుల కోపానికి కారణం అయ్యింది. అప్పటి నుంచి బన్నీని తో సరిపెట్టారు.

ఇక అప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఈ విషయం నలుగుతూనే ఉంది.  రెండు శిభిరాల నుంచి ఎవరో ఒకరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నికల్లో పవన్ భారీ విజయం సాధించడం.. డిప్యూటీ సీఎం గా పవన్  సీటు ఎక్కడంతో .. ఇక పరిస్థితి మారిపోయింది. .కామ్ అవుతుంది అనుకున్నారు. కాని ఏదో రకంగా ఈ విషయం నలుగుతూనే ఉంది. 
 

ఆమధ్య పవన్ కళ్యాణ్ హీరోలు.. స్మగ్లింగ్ పాత్రలు అంటూ కామెంట్ చేయడంతో.. మరోసారి ఈ విషయం వివాదం అయ్యింది. బన్నీని ఇండైరెక్ట్ గా అన్నారంటూ సోషల్ మీడియా దద్దరిల్లింది. ఇక రీసెంట్ గా బన్నీ మామ కూడా పవన్ పై విమర్శలు చేశారు.. అంతటితోఆగకుండా..  అల్లు అర్జున్ వదిలిపెట్టకుండా.. ఇండైరెక్ట్ గా సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు.
 

Allu Arjun

రీసెట్ గా ఓ ఈవెంట్ లో బన్నీ మాట్లాడిన మాటలు అగ్గి రాజేశాయి. నా ఇష్టమొచ్చిట్టు నేను ఉండకూడదా.. నేను అభిమానుల కోసం హీరో అయ్యా.. అంటూ.. రకరకాల కామెంట్స్ చేశాయి. దాంతో ఈ మంటలు ఇప్పట్లో ఆరేట్టు కనిపించడంలేదు. మరి ఈ ఇ్యూఎంత వరకూ వెళ్తుందో చూడాలి. మెగా ‌ - అల్లు వార్ లో ముందు ముందు ఎలాంటివి చూడాల్సి వస్తుందో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు.. బాధపడుతున్నారు. 

Latest Videos

click me!