పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ మూవీస్ లో 'జల్సా' చిత్రం ఒకటి. ఈ చిత్రంలో పార్వతి మెల్టన్, ఇలియానా హీరోయిన్లుగా నటించారు. ఇలియానా అప్పట్లో మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పార్వతి మెల్టన్ గ్లామర్ కి యువత ఫిదా అయ్యారు. పార్వతి మెల్టన్ కొన్ని చిన్న చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తింపు తీసుకువచ్చిన మూవీ జల్సా.