'జైలర్' మూవీలో బాలయ్య ఉండాల్సింది, కానీ ఏం జరిగిందంటే.. డైరెక్టర్ నెల్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Aug 12, 2023, 07:08 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దుసుకుపోతోంది.

PREV
16
'జైలర్' మూవీలో బాలయ్య ఉండాల్సింది, కానీ ఏం జరిగిందంటే.. డైరెక్టర్ నెల్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దుసుకుపోతోంది. దీనితో చాలా కాలం తర్వాత రజనీ స్థాయికి తగ్గట్లుగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదవుతున్నాయి. 

26

తమన్నా, రమ్యకృష్ణ, సునీల్, వసంత్ రవి, యోగిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో రజనీ పెర్ఫామెన్స్ అదరగొట్టేశారు. అలాగే శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు కూడా ఈ చిత్రంలో కామియో రోల్స్ పోషించడం విశేషం. ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో నెల్సన్ దిలీప్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 

36

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది జైలర్ ఏమైనా మల్టీస్టారర్ చిత్రమా అని ముందు అనుకున్నారు. కానీ రజనీ సర్ ఒక్కరు స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. ఫుల్ జోష్ ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని మల్టీస్టారర్ గా తెరకెక్కించలేదు. కానీ ఆకర్షణ కోసం మాత్రమే శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి హీరోలని పెట్టినట్లు నెల్సన్ పేర్కొన్నాడు. 

46

ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణని కూడా ఒక పాత్రలో నటింపజేయాలని అనుకున్నా. అది కుదర్లేదు. స్క్రిప్ట్ రాసేటప్పుడే బాలయ్య గురించి ఆలోచన వచ్చింది. కానీ స్క్రిప్ట్ పూర్తయ్యాక బాలకృష్ణని తీసుకోవాలన్న పాత్ర సరిగ్గా రాలేదు. దీనితో ఆ పాత్రలో బాలయ్యని నటింపజేయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఆ ఆలోచన విరమించుకున్నట్లు నెల్సన్ తెలిపారు. భవిష్యత్తులో బాలయ్యతో సినిమా చేస్తానేమో అని అన్నారు. 

56

రజనీ చిత్రంలో బాలయ్య కూడా ఉంది ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రచ్చ మరో స్థాయిలో ఉండేదని అభిమానులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జైలర్ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రలో తొలి రోజు ఈ చిత్రం ఏకంగా 7 కోట్ల షేర్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా 91 కోట్ల గ్రాస్ ని ఫస్ట్ డే రోజునే తలైవా చిత్రం సాధించింది. 

66

జోరు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు జైలర్ చిత్రంలో భారీ లాభాలు అందుకునేలా ఉన్నారు. తెలుగురాష్ట్రాల ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం 12 కోట్లు మాత్రమే. తొలిరోజే 7 కోట్లు రాబట్టేసింది. వీకెండ్ ముగిసే సరికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి లాభాలని పంచిపెడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. 

click me!

Recommended Stories