Jailer 2 Break 2.0 Records: 2.0 రికార్డులు బ్రేక్‌.. కోలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌ జైలర్‌ 2

Published : Oct 27, 2026, 08:20 AM IST

రజనీకాంత్‌ నటించిన `జైలర్‌ 2` మూవీ కోలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇది తమిళంలో అత్యధిక వసూళ్లని రాబట్టిన రోబో 2.0 మూవీ రికార్డులను బ్రేక్‌ చేసింది. దీంతో తన రికార్డులను తానే బ్రేక్‌ చేసుకున్నారు రజనీకాంత్‌.

PREV
15
కోలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌ గా జైలర్‌ 2

రజనీకాంత్‌ తన రికార్డులను తానే బ్రేక్‌ చేసుకున్నాడు. అదే సమయంలో కోలీవుడ్‌కి మరో ఇండస్ట్రీ హిట్‌ని అందించారు. తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా `రోబో 2.0` ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.723కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ రికార్డులను రజనీకాంత్‌ మరో మూవీ `జైలర్‌ 2` బ్రేక్‌ చేసింది. దీంతో సూపర్‌ స్టార్‌ తన సినిమా రికార్డులను తానే బ్రేక్‌ చేయడంతోపాటు కోలీవుడ్‌కి మరో ఇండస్ట్రీ హిట్‌ని అందించారని చెప్పొచ్చు.

25
జైలర్‌ 2 12 రోజుల కలెక్షన్లు

మరి దసరా కానుకగా విడుదలైన `జైలర్‌ 2` మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే, ఈ సినిమా ఏకంగా రూ.733.35కోట్లు సాధించింది. కేవలం 12 రోజుల్లోనే ఈ రేంజ్‌ వసూళ్లని రాబట్టడం విశేషం. ఇక సోమవారం ఈ మూవీకి ఎంత వచ్చాయనేది చూస్తే, సుమారు రూ.14కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా గ్రాస్‌ రూ.11కోట్లు, ఓవర్సీస్‌లో రెండున్నర కోట్లు సాధించింది. సోమవారం వసూళ్లు భారీగా పడిపోయాయి. అయినా బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం స్ట్రాంగ్‌గానే ఉండటం విశేషం.

35
తెలుగులో అదిరిపోయే వసూళ్లు

ఇక 12వ రోజు తమిళంలో రూ.5.65కోట్లు, తెలుగులో రెండు కోట్లు, హిందీలో కోటిన్నర, కన్నడలో 40లక్షలు వసూలు చేసింది. ఇండియాలో దీనికి రూ.477.85కోట్ల గ్రాస్‌, రూ.408కోట్ల నెట్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో రూ.255.50కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఓవరాల్‌గా తెలుగులో ఈ చిత్రానికి రూ.87.55కోట్లు, తమిళంలో రూ.186.25కోట్లు, కన్నడలో రూ.82.75కోట్లు, కేరళాలో రూ.71.85కోట్లు, హిందీలో రూ.49.45కోట్లు రాబట్టింది. తెలుగులో ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయినట్టు సమాచారం.

45
2.0 రికార్డులు బ్రేక్‌

ప్రస్తుతం `జైలర్‌ 2` లాభాల్లో నడుస్తోంది. ఊహించని లాభాలు వస్తున్నాయి. కేవలం లాభాలే కాదు.. ఇప్పుడు కోలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది `జైలర్‌ 2`. ఇప్పటి వరకు తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా `2.0` మూవీ ఉంది. రజనీకాంత్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.723కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది. దీంతో `2.0` రికార్డ్ ని రూ.733కోట్లతో `జైలర్ 2` బ్రేక్‌ చేసిందని చెప్పొచ్చు. మొత్తంగా రజనీకాంత్‌ తన రికార్డుని తానే బ్రేక్‌ చేసుకోవడంతోపాటు కోలీవుడ్‌ కి మరో ఇండస్ట్రీ హిట్‌ని అందించారని చెప్పొచ్చు. అయితే మరికొన్ని కథనాల ప్రకారం `2.0`లో సుమారు ఎనిమిది కోట్ల వరకు రాబట్టినట్టు చెబుతున్నారు. ఆ రికార్డుని కూడా ఈ చిత్రం ఈ వారంలోనే బ్రేక్‌ చేయబోతుందని చెప్పొచ్చు.

55
జైలర్ 2 టీమ్‌ ఇదే

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన `జైలర్‌ 2` మూవీ మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్‌`కి సీక్వెల్‌. ఇందులో రమ్యకృష్ణ, మీర్నా, యోగిబాబు, నమో నారాయణ, ఎస్‌ జే సూర్య, విద్యాబాలన్‌, మిథున్‌ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించగా, మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌, జాకీ షరాఫ్‌ క్యామియో రోల్స్ లో మెప్పించారు. దసరా స్పెషల్‌గా అక్టోబర్‌ 15న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో రన్‌ అయిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories