Rajamouli: రాజమౌళి సినిమాలో విలన్ గా చేయాలనుకున్నాడు, కట్ చేస్తే హీరోగా హిట్.. 2 ఏళ్ళు రిజెక్ట్ చేసిన మూవీ

Published : Oct 27, 2026, 06:30 AM IST

రాజమౌళి సినిమాలో విలన్ గా నటించాలనుకుని సడెన్ గా హీరోగా మూవీ చేసిన నటుడు ఒకరున్నారు. వీరి కాంబోలో వచ్చిన సినిమా సూపర్ హిట్ కూడా అయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ? ఆ నటుడు ఎవరు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

PREV
15
Rajamouli

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించాలని నటీనటులందరికీ కోరిక ఉంటుంది. టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయమైన సునీల్ కి కూడా రాజమౌళి సినిమాలో నటించాలనే ఆశ ఉండేదట. కానీ కమెడియన్ గా, హీరోగా కాదు.. విలన్ గా నటించాలని ఉండేదట. అనుకోకుండా గాడ్ గిఫ్ట్ వల్ల మర్యాద రామన్న సినిమాలో హీరోగా నటించాను అని సునీల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

25
సునీల్ రిజెక్ట్ చేసిన మూవీ

ఆ సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళి గారికే దక్కుతుంది. ఓ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్ లో మర్యాద రామన్న మూవీ గురించి రాజమౌళి గారు చెప్పారు. నువ్వే హీరో అని ఆయన చెప్పగానే షాక్ అయ్యాను. నిజంగా ఆ సినిమా నాకు ఒక వరం సునీల్ తెలిపారు. అసలు అందాల రాముడు మూవీలో ఛాన్స్ వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళు ఎంత అడుగుతున్నా 2 ఏళ్ళ పాటు నేను చేయను అని చెబుతూనే ఉన్నాను.

35
అంత కెపాసిటీ ఉందా అనే అనుమానం

దానికి కారణం నాలో ఉన్న భయం. అప్పటి వరకు ప్రతి సినిమాలో అరగంట కానీ, గంట కానీ కమెడియన్ గా కనిపించి నవ్వించే వాడిని. హీరోగా మొత్తం రెండున్నర గంటల పాటు ఆడియన్స్ ని నేనే ఎంగేజ్ చేయాలి. అంత కెపాసిటీ మనకు ఉందా అనే అనుమానంతో నేను చేయను అని చెప్పారు.

45
మరచిపోయిన డ్యాన్సులు మళ్ళీ నేర్చుకున్నా

కానీ చివరికి అందాల రాముడు చేయాల్సి వచ్చింది. హీరోగా నటించడం అంటే ఒక బాధ్యత. దీనితో ఎప్పుడో నేర్చుకున్న డ్యాన్స్ ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి డ్యాన్సులు చేశా. ఆడియన్స్ ని ఎలాగైనా మెప్పించడం కోసం కష్టపడ్డాను.

55
పూల రంగడు కోసం సిక్స్ ప్యాక్

ఇక పూల రంగడు సినిమా చేస్తున్నప్పుడు అనుమానం మొదలలైంది. మర్యాదరామన్న సినిమా స్థలం గురించే.. ఇది కూడా స్థలం గురించే.. రెండూ ఒకేలా ఉన్నాయి అని అంటారేమో అని.. ఏదైనా కొత్తగా ఉండాలి అని సిక్స్ ప్యాక్ ట్రై చేసినట్లు సునీల్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories