`జబర్దస్త్` వర్ష ఇచ్చిన షాక్‌కి ట్రోలర్స్ కి మైండ్‌ బ్లాక్.. నోళ్లు మూయించేందుకు భలే ట్రిక్‌!

Published : Aug 20, 2021, 01:16 PM ISTUpdated : Aug 20, 2021, 02:35 PM IST

`జబర్దస్త్` వర్ష ట్రోలర్స్ కి, నెగటివ్‌ కామెంట్లు చేసే వారికి షాక్‌ ఇచ్చింది. ఇన్నాళ్లు విచ్చలవిడి కామెంట్లతో రెచ్చిపోయే వారికి తనదైన స్టయిల్‌లో ఫుల్‌స్టాప్‌ పెట్టింది. మరోవైపు తన అందాల ఫోటో షూట్‌తో రెచ్చిపోయింది.   

PREV
17
`జబర్దస్త్` వర్ష ఇచ్చిన షాక్‌కి ట్రోలర్స్ కి మైండ్‌ బ్లాక్.. నోళ్లు మూయించేందుకు భలే ట్రిక్‌!

`జబర్దస్త్` వర్ష.. ఈ కామెడీ షోలో పాపులర్‌ లేడీ కమేడియన్‌. ఈ షో మరే లేడీ కమెడీయన్‌కి ఈ రేంజ్‌లో పాపులారిటీ, క్రేజ్‌ రాలేదంటే అతిశయోక్తి కాదు. అంతగా తనదైన కామెడీ, అందంతో మెస్మరైజ్‌ చేసింది. ఇప్పటికే కనువిందు చేస్తూనే ఉంటుంది. 
 

27

ఇమ్మాన్యుయెల్‌లో కలిసి ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరికి బాగా సూట్‌ అయ్యింది. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఎఫైర్స్ యాడ్‌ అయ్యారు. ఒకరిని విడిచి,  మరొకరు ఉండలేరనేంతగా, వీరిద్దరు కలిసి చేయకపోతే ఆ స్కిట్‌ కూడా పండదనేంతగా వీరికి ఆడియెన్స్ లో ఇమేజ్‌ని, క్రేజ్‌ ఏర్పడింది. 

37

అదే సమయంలో తనపై ఇటీవల దారుణమైన కామెంట్లు వస్తున్నాయని, ట్రోల్‌ చేస్తున్నారని `జబర్దస్త్` షోలో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. తన తమ్ముడు ఆ కామెంట్లని ఫోన్‌లో చూపిస్తూ ఏంటక్కా ఇవి అంటే.. తనకు మొఖం లేదని చెప్పింది వర్ష. అదే సమయంలో రోజా, రష్మి, జబర్దస్త్ కమెడీయన్లు ఇచ్చిన సపోర్ట్ తాను ధైర్యంగా ముందుకు సాగుతానని తెలిపింది. ఇక్కడే పోరాడతానని వెల్లడించింది. 

47

తాజాగా వర్ష నెటిజన్లకి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.  ఇన్‌స్టాగ్రామ్‌లో వర్ష తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెట్టింట తన క్రేజ్‌ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. 
 

57

అందులో భాగంగా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లకు కామెంట్లు చేసే ఆప్షన్‌ తీసేసింది. దీంతో ఎవరు కామెంట్‌ చేయడానికి లేకుండా చేసింది. తనపై వచ్చే కామెంట్లకి ఈ రూపంలో చెక్‌ పెట్టింది వర్ష. గత కొన్ని రోజులుగా వర్ష ఇలానే చేస్తుంది. అయితే లేటెస్ట్ గా పంచుకున్న ఒకే ఒక్క పోస్ట్ కి మాత్రం ఆ అవకాశం ఇచ్చింది. 

67

ఈ సందర్భంగా నెటిజన్లకి,అభిమానులకు రిక్వెస్ట్ చేసింది వర్ష. నన్ను కాదు, నాలోని ఆర్ట్ ని చూడమని తెలిపింది. అందుకు ఆమె అభిమానులు సపోర్ట్ చేస్తూ కామెంట్లు, లవ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు.

77

`జబర్దస్త్` తో పాపులర్ అయిన వర్ష.. అంతకు ముందు యాంకర్‌గా, టీవీ సీరియల్‌ నటిగా రాణించింది. ఇప్పుడు `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`, `రెచ్చిపోద్దాం బ్రదర్‌` వంటి షోలో మెరుస్తుంది వర్ష. టీవీ షోస్‌తో మొత్తంగా ఫుల్‌ బిజీ అవుతుంది. అదే సమయంలో కామెంట్లకి చెక్‌ పెట్టేందుకు ఇమ్మాన్యుయెల్‌కి స్కిట్లలో బ్రేకిచ్చింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories