ఆ మధ్యలో దర్శకుడిగానే తన కేరీర్ కొనసాగించాలని అనుకుంటున్నట్టు కూడా ప్రకటించాడు. అన్నట్టుగానే నటుడు, నిర్మాత నాగబాబు, జేడీ చక్రవర్తి, రావు రమేష్ చేతుల మీదుగా తన సినిమా పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాడు. ఆయన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తుండగా.. సినిమాకు కొవ్వూరు అరుణాచలం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చరణ్ అర్జుణ్ సంగీతం అందిస్తున్నారు.