ఎల్లో గౌన్‌లో జబర్దస్త్ యాంకర్‌ స్టన్నింగ్‌ పోజులు.. ఫుల్‌ బాటిల్‌ కావాలా? అంటూ సౌమ్యరావుపై సెటైర్లు

Published : Mar 16, 2023, 04:09 PM IST

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు క్యూట్‌ అందాలతో అలరిస్తుంది. యాంకర్‌గా మెప్పిస్తూనే గ్లామర్‌ ఫోటో షూట్లతో మైమరపింప చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె పోజులు స్టన్నింగ్‌గా ఉండటం విశేషం.   

PREV
16
ఎల్లో గౌన్‌లో జబర్దస్త్ యాంకర్‌ స్టన్నింగ్‌ పోజులు.. ఫుల్‌ బాటిల్‌ కావాలా? అంటూ సౌమ్యరావుపై సెటైర్లు

`జబర్దస్త్` యాంకర్‌ సౌమ్య రావు తాజాగా ఎల్లో డ్రెస్‌ లో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ గౌనులో ఎల్లోర శిల్పంలా మెరిసిపోతుంది. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. స్టన్నింగ్‌ స్టిల్స్ పంచుకుని ఇంటర్నెట్‌లో అలజడి సృష్టిస్తుంది సౌమ్య రావు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

26

ఇందులో సౌమ్య రావు ఇచ్చిన పోజులు చర్చనీయాంశం అవుతున్నాయి. కొన్ని కొంటెగా, మరికొన్ని చిలిపిగా పోజులిచ్చింది జబర్దస్త్ యాంకర్‌. అయితే అందులో ఓ ఫోటోపై మాత్రం నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆమె షేర్‌ చేసిన మొదటి ఫోటోనే ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతుంది.
 

36

సౌమ్య రావు మొదటి ఫోటోలో ఆమె చేయి పైకెత్తి పట్టుకుని ఓ కన్నుతో దోబూచులాడుతుంది. అయితే చూడ్డానికి అది మరోలా ఉంది. ఫుల్‌ బాటిల్‌(మందు) అడిగినట్టుగా ఉంది. దీన్నే హైలైట్‌ చేస్తూ, ఫుల్‌ బాటిల్‌ కావాలా చేయి అంతా పెట్టావు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. మరోవైపు బ్యూటీ, టాలెంటెడ్‌ యాంకర్‌ అని, ఎల్లో డ్రెస్‌లో లుక్స్ అమేజింగ్‌ అంటున్నారు. 

46

అనసూయ స్థానంలో యాంకర్‌గా వచ్చింది సౌమ్య రావు. అయితే మిశ్రమ స్పందన రాబట్టుకుంటుంది. ఈమెపై కొందరు పెదవి విరుస్తున్నారు. మరికొందరు సింప్లీ సూపర్‌ అంటున్నారు. అనసూయ రేంజ్‌లో సందడి చేయడం లేదని, ఆ గ్రేస్‌ కనిపించడం లేదని, కానీ పంచ్ లకు అదిరిపోయే కౌంటర్లిస్తుందని అంటున్నారు. 

56

మరోవైపు ఇటీవల ఆమె రీల్స్ లో డాన్సు వీడియోలు పంచుకుంది సౌమ్య రావు. రెగ్యూలర్‌గా ఇలాంటి పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోల్స్ కి గురయ్యింది. డాన్సు చెత్తగా ఉందని, దయజేసి ఆ డాన్సులు చేయకండి అంటున్నారు. ఆ డాన్సు చూడలేకపోతున్నామంటున్నారు. నెట్టింట గోల చేశారు. అయినా అవేవి పట్టించుకోకుండా తన పని తానుచేసుకుంటూ పోతుంది సౌమ్యరావు. 
 

66

కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీ సీరియల్స్, చిన్న చిన్న షోలు చేసుకుంటూ ఆకట్టుకుంది. ఈటీవీ ఈవెంట్‌లో పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత ఏకంగా జబర్దస్త్ షోకే యాంకర్‌గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు పాపులారిటీ, క్రేజ్‌ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories