పారితోషికం అంతా ఇచ్చేశాం, కానీ.. ఛార్మితో గొడవపై అసలు నిజం బయటపెట్టిన నిర్మాత..

Published : Jul 22, 2023, 05:11 PM IST

హీరోయిన్‌ ఛార్మితో గొడవకి సంబంధించి నిర్మాత యలమంచిలి రవి తాజాగా ఓపెన్‌ అయ్యారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగిందో చెప్పాడు. 

PREV
16
పారితోషికం అంతా ఇచ్చేశాం, కానీ.. ఛార్మితో గొడవపై అసలు నిజం బయటపెట్టిన నిర్మాత..

ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తున్న ఛార్మీ కెరీర్‌ ప్రారంభమైంది హీరోయిన్‌గానే అనే విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. బిజీగా హీరోయిన్‌గా మెప్పించింది. గ్లామర్‌ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. దాదాపు ఏడెనిమిదేళ్ల పాటు టాలీవుడ్‌ని ఊపేసింది. అయితే ఆ తర్వాత ఫెయిల్యూర్స్ కారణంగా సినిమాలు తగ్గాయి. దీనికితోడు తను కూడా సినిమాలు తగ్గించి ప్రొడక్షన్‌ వైపు వెళ్లింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌.. ప్రొడక్షన్‌లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 

26

అయితే ఛార్మి కెరీర్‌లో చాలా ఫెయిల్యూర్స్‌ ఉన్నాయి. ఒకటి రెండు గొడవలు కూడా ఉన్నాయి. జనరల్‌గా హీరోయిన్లు సినిమా షూటింగ్‌లు అయిపోయాక ప్రమోషన్స్ సమయంలో సపోర్ట్ చేయరనే కామెంట్స్ తరచూ వినిపిస్తుంటుంది. వాళ్లు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటారు కాబట్టి బిజీగా ఉంటారు. సినిమా షూటింగ్‌ వరకే పరిమితం అనేలా ఉంటుంది. కానీ ప్రమోషన్స్ సమయంలో హీరోహీరోయిన్లు చాలా ముఖ్యం. వాళ్లు లేకపోతే ప్రమోషన్స్ కష్టమవుతుంది. సినిమా జనాల్లోకి వెళ్లదు. వాళ్లు హ్యాండిచ్చారంటే నిర్మాతకి చుక్కలు కనిపిస్తాయి. 
 

36

ఓ సారి ఛార్మి హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందే పెట్టిందట. `మాయగాడు` సినిమా సమయంలో ఛార్మి, నిర్మాతకి మధ్య గొడవలయ్యాయనే వార్తలొచ్చాయి. అప్పట్లో అది హాట్‌ టాపిక్‌ అయ్యింది. తాజాగా `మాయగాడు` నిర్మాత యలమంచి రవి దీనిపై ఓపెన్‌ అయ్యారు. `రియల్‌ టాక్‌ విత్‌ అంజి` ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరోయిన్‌ ఛార్మితో గొడవకి సంబంధించి అసలు విషయాన్ని బయటపెట్టారు. 
 

46

యాంకర్ అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ, `మాయగాడు` సినిమా పూర్తయ్యింది. హీరోయిన్‌కి పారితోషికం అంతా ముందే ఇచ్చేశాం. ఏం సమస్య లేదు. కానీ రిలీజ్‌ టైమ్‌లో హీరోయిన్‌ ప్రమోషన్స్ కి రాలేదు. ఎంత అడిగినా నో చెప్పేదట. చాలా ఇబ్బంది పెట్టిందట. ప్రమోషన్స్ టైమ్‌లో హ్యాండివ్వడంతో తాము రైజ్‌ కావాల్సి వచ్చిందని, చాలా అగ్రెసివ్‌గా వెళ్లామని చెప్పారు యలమంచి రవి.

56

దీంతో ఈ విషయాన్ని `మా` అసోసియేషన్‌లో కంప్లెయింట్‌ చేసిందని, అప్పుడు మరళీమోహన్‌ అధ్యక్షుడిగా ఉన్నాడని, ఆయన మాట్లాడి సెటిల్‌ చేశారని, ఆ తర్వాత ప్రమోషన్స్ కి వచ్చిందన్నారు. కానీ సినిమా ఫెయిల్‌ అయ్యిందని తెలిపారు. మంచి కథ, కాంబినేషన్‌ ఉంది కానీ, దర్శకుడు సరైన విధంగా తీయలేకపోయాడని తెలిపారు. అంతకు మించిన విభేదాలు లేవని తెలిపారు. 
 

66

`మాయగాడు` చిత్రంలో వేణు తొట్టేంపూడి హీరోగా నటించగా, ఛార్మి హీరోయిన్‌. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత వేణు రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రమిది. దిలిప్‌ పోలన్ దర్శకత్వం వహించారు. సాంబశివ క్రియేషన్స్ పతాకంపై యలమంచిలి రవి ఈ సినిమా నిర్మించారు. చాలా డిలే తర్వాత 2011 జులై 16న ఈ సినిమా విడుదలైంది. నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఛార్మి ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో కలిసి `పూరీ కనెక్ట్స్`పై సినిమాలు నిర్మిస్తుంది. వీటికి పూరీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ తో `డబుల్‌ ఇస్మార్ట్` చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories