‘రచ్చ’ సినిమా సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తమన్నా (Tamannaah) ఏమాత్రం పట్టించుకోలేదంట. అందుకు కారణం ఏంటీ.. అసలు మిల్క్ బ్యూటీ అలా ఎందుకు చేసిందనేది ఆసక్తికరంగా మారింది.
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జంటగా ఒకే ఒక్క సినిమా ‘రచ్చ’ వచ్చింది. మంచి రిజల్ట్ ను అందుకుందీ చిత్రం..
26
ఈ సినిమాకు సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వం వహించారు. 2012లో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ తమన్నా, చరణ్ అభిమానులు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వీరిద్దరి డాన్స్ కు అప్పట్లో అంతా ఫిదా అయ్యారు.
36
అయితే తమన్నా మరోసారి సంపత్ నందితో కలిసి Odela 2 చిత్రంలో నటిస్తోంది. దీనికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్ నంది నిర్మిస్తూ కథను అందించారు. నిన్న షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో తమన్నా గురించి ఆసక్తికరమైన వెలుగులోకి వచ్చింది.
46
అందేంటో కాదు... రామ్ చరణ్ తో తమన్నాకు గొడవ ఉందని, ‘రచ్చ’ సినిమా షూటింగ్ సమయంలో చెర్రీని అవమానించిందని ఇప్పుడు పలువురు చర్చించుకుంటున్నారు.
56
దానిపై క్లారిటీ కూడా వినిపిస్తోంది.. చరణ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొడుకు కావడంతో కాస్తా దూరంగా ఉండేదంట. డాన్స్ రిహార్సల్స్ కూడా సెపరేట్ గా చేసేదంట. ఒక్కరోజు మాత్రమే ఇద్దరు కలిసి చేశారని అంటున్నారు.
66
చరణ్ తో కలిసి రిహార్సల్ చేయకపోవడానికి కారణం... కేవలం చెర్రీ చిరంజీవి కొడుకు కావడంతో కాస్తా మర్యాదపూర్వకంగా దూరంగా ఉండేదని తెలుస్తోంది. అంతేకానీ చరణ్ ను పట్టించుకోకుండా అలా ఏం చేయలేదని క్లారిటీ వస్తోంది.