సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, కలిసుందాం రా లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో సిమ్రాన్ నటించింది. తెలుగులో సిమ్రాన్ గురించి ఎలాంటి రూమర్స్ లేవు. కానీ తమిళ సినిమా కోలీవుడ్ లో సిమ్రాన్ పై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. దళపతి విజయ్ తో సిమ్రాన్ కెరీర్ బిగినింగ్ లో ప్రేమ వ్యవహారం సాగించిందట. ఆ తర్వాత డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమలో పడింది. ఆయన ఎవరో కాదు రాజు సుందరం. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం, సిమ్రాన్ మధ్య అప్పట్లో ఘాడమైన లవ్ ఎఫైర్ సాగిందట. సీక్రెట్ గా వీళ్లిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా రూమర్స్ వచ్చాయి.