Indraja Remuneration: జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ సంచలనం.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

Published : Jul 19, 2026, 08:29 AM IST

Indraja Remuneration: నాగబాబు, రోజా తరువాత ఆస్థాయిలో జబర్దస్త్ జడ్జిగా సక్సెస్ అయ్యింది మాజీ హీరోయిన్ ఇంద్రజ. జబర్ధస్త్ కు రోజాను మించి చేస్తోంది. మరి జబర్ధస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు జడ్జిగా ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

PREV
14
తెలుగు టెలివిజన్ లో తిరుగులేని కామెడీషో..

తెలుగు బుల్లితెరపై గత పదేళ్లకు పైగా తిరుగులేని కామెడీ షోగా దూసుకుపోతోంది ఈటీవీ 'జబర్దస్త్'. ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన ఈ షో, ఇప్పటికీ ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపడేస్తూనే ఉంది. అయితే, ఈ షో విజయవంతం కావడంలో కేవలం కమెడియన్ల స్క్రిప్టులు, పంచ్‌లు మాత్రమే కాదు.. జడ్జీలుగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీల నవ్వులు, వారు ఇచ్చే మార్కులు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

24
జబర్దస్త్ జడ్జిగా సక్సెస్ అయిన ఇంద్రజ..

ప్రస్తుతం జబర్దస్త్ షోకు సీనియర్ నటి ఇంద్రజ ప్రధాన జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రోజా, నాగబాబు వంటి ప్రముఖులు ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించి మెప్పించగా, వారి స్థానంలోకి వచ్చిన ఇంద్రజ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తనదైన క్లాస్ లుక్, కమెడియన్లను ప్రోత్సహించే విధానం, ఆమె నవ్వు ఈ షోకు కొత్త గ్లామర్‌ను తెచ్చిపెట్టాయి. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇంద్రజ జబర్దస్త్ షో కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.

34
ఇంద్రజ రెమ్యునరేషన్ వివరాలు..

తాజా సమాచారం ప్రకారం, జబర్దస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు ఇంద్రజ భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆమెకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 2 లక్షల వరకు రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారట. ఒక వారానికి రెండు ఎపిసోడ్‌లు షూట్ చేస్తే.. కేవలం రెండు రోజుల్లోనే ఆమె సుమారు 4 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నెలవారీగా చూసుకుంటే ఈ ఆదాయం దాదాపు 12 నుండి 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది. ఇంద్రజ కూడా తన రెమ్యునరేషన్ పై ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు.

44
బుల్లితెరపై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జడ్జి

ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా అలరించిన ఇంద్రజ, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలకు జంటగా నటించి మెప్పించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై ఈ రేంజ్‌లో దూసుకుపోతుండటం విశేషం. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా ఆమె సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. ఇక బుల్లితెరపై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జడ్జిగా ఇంద్రజ తన హవాను కొనసాగిస్తూ.. దూసుకుపోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories