Top 10 OTT Series: నెట్‌ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న కామెడీ డ్రామా.. టాప్‌ 10 సిరీస్‌ ఇవే

Published : Apr 11, 2026, 06:13 PM IST

Top 10 OTT Series: ఈ వారం నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ సిరీస్‌ల లిస్ట్‌లో ఎక్కువగా ఇంగ్లీష్ సిరీస్‌లే ఉన్నాయి.  ఇందులో ఒక కోర్ట్ రూమ్‌ కామెడీ డ్రామా మాత్రం దుమ్ములేపుతోంది. 

PREV
110
10. ఏజెంట్ ఫ్రమ్ అబవ్

ఇది ఒక తైవాన్ ఫాంటసీ వెబ్ సిరీస్. టీన్సీ రాసిన 'ది ఒరాకిల్ కమ్స్' అనే నవల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఏప్రిల్ 2, 2026 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇండియాలో టాప్‌ 10 సిరీస్‌లో పదో స్థానంలో ట్రెండ్‌ అవుతుంది.

210
9. హలో బచ్చోన్

ఇది TVF బయోగ్రాఫికల్ డ్రామా సిరీస్. ఇందులో ఎడ్‌టెక్ యూనికార్న్ 'ఫిజిక్స్ వాలా' ఫౌండర్ అలఖ్ పాండే కథను చూపించారు. వునెట్ వినీత్ కుమార్ సింగ్ ఇందులో లీడ్ యాక్టర్‌గా నటించారు.  మార్చి 6, 2026 నుంచి నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇప్పుడు ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది.

310
8. సింగిల్ పాపా

ఇది ఒక కామెడీ డ్రామా సిరీస్. దీనికి నీరజ్ ఉధ్వానీ క్రియేటర్. ఈ సిరీస్‌లో కునాల్ ఖేమూ ప్రధాన పాత్ర పోషించారు.  ఆద్యంతం  నవ్వులు పూయించే ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో  డిసెంబర్ 12, 2025 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఎనిమిదో స్థానంలో ఉంది.

410
7. ది క్లీనింగ్ లేడీ

ఇది ఒక అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్. ఇప్పటివరకు దీనికి 4 సీజన్లు వచ్చాయి, ఐదోది కూడా రాబోతోంది. దీని గత సీజన్ మార్చి 25, 2025న వచ్చింది. కానీ ఇప్పుడు జనవరి 3, 2022లో వచ్చిన సిరీస్‌ ఇప్పుడు ట్రెండ్‌ కావడం విశేషం. 

510
6. సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ గోయింగ్ టు హ్యాపెన్

ఇది ఒక అమెరికన్ హారర్ మినీ సిరీస్. దీనికి హాలే జి. బోస్టన్ క్రియేటర్. ప్రస్తుతం దీని మొదటి సీజన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది మార్చి 26, 2026 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇండియాలో ఇది విశేష ఆదరణ పొందుతోంది. 

610
5. వన్ పీస్

ఇది ఇంగ్లీష్, జపనీస్ భాషల్లో వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్. దీనికి రెండు సీజన్లు వచ్చాయి. ఇది 1997లో వచ్చిన ఇదే పేరు గల జపనీస్ మాంగా సిరీస్   లైవ్ యాక్షన్ అడాప్షన్.  నెట్‌ఫ్లిక్స్‌లో  ఆగస్టు 31, 2023 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇప్పుడు ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది.

710
4. తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్

ఈ హిందీ సిరీస్‌కు ఇప్పటివరకు మొదటి సీజన్ మాత్రమే వచ్చింది. ఈ  క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను నీరజ్ పాండే క్రియేట్ చేశారు. ఇమ్రాన్ హష్మీ ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌లో  జనవరి 14, 2026 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇప్పుడు టాప్‌ 4లో ట్రెండ్‌ అవుతుంది.

810
3. XO, కిట్టీ

ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూడో సీజన్ ఏప్రిల్ 2, 2026న స్ట్రీమింగ్ ప్రారంభమైంది. జెన్నీ హాన్ ఈ సిరీస్‌ను క్రియేట్ చేశారు.  ఈ సిరీస్‌ ఇండియాలో దుమ్ములేపుతోంది.

910
2. బ్లడ్‌హౌండ్స్

ఈ సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్ రెండో సీజన్ ఏప్రిల్ 3, 2026న స్ట్రీమింగ్ ప్రారంభమైంది. జాసన్ కిమ్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.  ఇదిప్పుడు టాప్‌ 2లో ట్రెండ్‌ కావడం విశేషం.

1010
1. మామ్లా లీగల్ హై

రవి కిషన్, నైలా గ్రెవాల్ వంటి నటులు నటించిన ఈ సిరీస్ రెండో సీజన్ ఏప్రిల్ 3, 2026 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ లీగల్ డ్రామా కామెడీ సిరీస్‌ను సమీర్ సక్సేనా, సౌరభ్ ఖన్నా, కునాల్ అనేజా క్రియేట్ చేశారు. ఇదినెట్‌ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో ట్రెండ్‌ కావడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories