భారతీయ రెజ్లర్లు చేస్తున్న పోరాటం ప్రస్తుతం దేశం మొత్తం సంచలనంగా మారింది. అన్ని వర్గాల ప్రజల నుంచి వారికి మద్దతు లభిస్తోంది. బీజేపీ ఎంపీ, ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని లైంగికంగా వేధించాడని సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత లాంటి రెజ్లర్లు గత 6 నెలలుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.