దిమ్మతిరిగిపోయేలా రష్మిక మందన్న లైనప్.. బిజీయెస్ట్ హీరోయిన్ గా నేషనల్ క్రష్..

Published : Jul 10, 2022, 03:24 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలను ఏలుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ.. లైనప్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ప్రస్తుతం రష్మిక ఏఏ ప్రాజెక్టుల్లో నటిస్తుందో తెలుసుకుందాం.  

PREV
18
దిమ్మతిరిగిపోయేలా రష్మిక మందన్న లైనప్.. బిజీయెస్ట్ హీరోయిన్ గా నేషనల్ క్రష్..

కన్నడ బ్యూటీ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘పుష్ప’ మూవీతో రష్మిక మందన్న పాపులారిటీ సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆరేడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ‘పుష్ప : ది రూల్’ (Pushpa The Rule) ఒకటి. శ్రీవల్లిగా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం సీక్వెల్ ను దర్శకుడు సుకుమార్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 
 

28

సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో దక్కించుకున్న తొలి అవకాశం ‘మిషన్ మంజు’. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి నటిస్తోంది. దర్శకుడు శంతను బాగ్చి తెరకెక్కిస్తున్నారు. జూన్ 10నే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కాస్తా ఆలస్యమైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు  కూడా పూర్తి ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయనున్నారు.

38

హిందీలో రష్మిక నటించిన రెండో చిత్రం ‘గుడ్ బై’ (Good bye). ఇందులో ఏకంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తో కలిసి నటించింది. దర్శకుడు వికాస్ బహి మూవీని డైరెక్ట్ చేశారు. గతేడాది ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం గత నెల జూన్ లో పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. త్వరలో రిలీజ్ డేట్ పై అప్డేట్స్ రానున్నాయి.
 

48

‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న హిందీ చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ బిగ్ ప్రాజెక్ట్ లోనూ రష్మిక మందన్న హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం తర్వాత రష్మిక  బాలీవుడ్ ను ఏలడం ఖాయం అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  
 

58

తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) సరసన  నటించే అవకాశం కూడా దక్కించుకుంది రష్మిక. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ శశాంక్ ఖైతాన్ దర్శకత్వం  వహిస్తున్నారు.   ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు దర్శకుడు. టైగర్ ష్రాఫ్ కూడా పిపరేషన్ వర్క్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా టైగర్ ష్రాష్ తో ఆడిపాడే  అవకాశాన్ని దక్కించుకుంది నేషనల్ క్రష్.  ఈ మూవీకి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 

68

ఇక ఇటు తెలుగులోనూ వరుస చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటోంది. యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘సీతా రామం’ మూవీలోనూ ఈ బ్యూటీ ఓ కీలక పాత్రల్లో నటిస్తోంది. తొలిసారిగా ముస్లిం అమ్మాయి అఫ్రీన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను  జోరుగా నిర్వహిస్తోంది. 

78

అలాగే తమిళ స్టార్ విజయ్ తళపతి అప్ కమింగ్ ఫిల్మ్ ‘వారసుడు’లోనూ హీరోయిన్ గా ఎంపికై రష్మిక అందరికీ షాక్ ఇచ్చింది. బడా హీరో విజయ్ సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో రష్మిక ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అతి తక్కువ సమయంలోనే తళపతి సినిమాలో ఎంపిక కావడం చూస్తే రష్మిక క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. 

88

ఇలా ప్రతి పెద్ద సినిమాలో, బడా హీరోల సరసన నటిస్తూ రష్మిక కేరీర్ లో దూసుకుపోతోంది. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.  ఏమాత్రం టైమ్ వేస్ట్ కాకుండా ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తోంది. అదే క్రమంలో కొత్త సినిమాలను లైనప్ చేస్తోంది. ఈ బ్యూటీ లైనప్ ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

click me!

Recommended Stories