అల్లు అర్జున్ బుధవారం రోజు తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బన్నీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప 2 విజయం తర్వాత మరిన్ని భారీ పాన్ ఇండియా చిత్రాలకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 800 కోట్ల భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 8 బుధవారం రోజు అల్లు అర్జున్ తన 43వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. దీనితో అభిమానులు, సెలెబ్రిటీలు బన్నీకి సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
25
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ
బన్నీ పుట్టినరోజు సందర్భంగా అతడి కెరీర్, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తన సతీమణి అల్లు స్నేహ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరికీ పరిచయం ఏర్పడినప్పుడు ఎలాంటి బంధం ఉండేది అనేది బన్నీ వివరించారు.
35
నీ గురించి ఏమీ తెలియదు
అల్లు స్నేహ సినిమా రంగానికి చెందిన అమ్మాయి కాదు. దీనితో సినిమా వాళ్ళ గురించి వచ్చే రూమర్స్ విని ఆశ్చర్యపోయేదట. దీనితో అల్లు అర్జున్ విషయంలో కూడా స్నేహకి అనుమానం ఉండేదట. ఒక రోజు మీట్ అయినప్పుడు నీ గురించి ఏమీ తెలియదు. నీ గురించి నువ్వు కాకుండా ఇంకెవరైనా చెబితే బావుంటుంది అని స్నేహ అల్లు అర్జున్ ని అడిగిందట.
దీనితో అల్లు అర్జున్ తన స్నేహితుడు సందీప్ అనే వ్యక్తిని తీసుకువచ్చారు. నా ఫ్రెండ్ స్నేహతో డైరెక్ట్ గా చెప్పారు. చూడండి.. సినిమా రంగం గురించి చాలా వార్తలు వస్తుంటాయి. కానీ నువ్వు బన్నీ గురించి ఏం నమ్ముతావ్, ఏమి అనుకుంటున్నావు అనేదే ఇక్కడ లెక్క. రూమర్స్ నిజమే అని నువ్వు భావిస్తే వదిలేసేయ్, పెళ్లి చేసుకోవద్దు అని ఓపెన్ గా చెప్పేశాడు. ఆ తర్వాత నేను కూడా అదే చెప్పాను. నీకు ఇష్టం లేకుంటే డ్రాప్ అయిపోదాం అని చెప్పినట్లు బన్నీ తెలిపాడు.
55
మా రిలేషన్ స్టార్ట్ కాకముందే పుకార్లు
కొంతకాలానికి ఆమెకే అర్థం అయింది. మా రిలేషన్ స్టార్ట్ కాకముందే చాలా పుకార్లు వచ్చాయి. ఇదేంటి బాబోయ్ అని స్నేహ అనుకుంది. ఇండస్ట్రీలో వచ్చే ప్రతి రూమర్ నిజం కాదు అని అర్థం చేసుకుంది. ఆ విధంగా తమ రిలేషన్ మొదలైంది అని అల్లు అర్జున్ తెలిపారు. జనాలకు కూడా మా పర్సనల్ లైఫ్ కంటే సినిమాలే ముఖ్యం. మేము స్క్రీన్ పై ఏం చేస్తున్నాం అనే దానిబట్టే వారి అభిమానం ఉంటుంది అని అల్లు అర్జున్ తెలిపారు.