పవన్ కావాలా? ఢీ కావాలా? అన్నారు... హైపర్ ఆది ఊహించని కామెంట్స్ 

Published : Feb 09, 2023, 04:09 PM IST

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన కామెంట్స్ చేశారు. ఒక నిర్మాత పవన్ కళ్యాణ్ కావాలా? ఢీ కావాలా? తేల్చుకో అని అడిగారని వెల్లడించారు. 

PREV
15
పవన్ కావాలా? ఢీ కావాలా? అన్నారు... హైపర్ ఆది ఊహించని కామెంట్స్ 

బుల్లితెర స్టార్ హైపర్ ఆది సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తున్నారు. ఆయన హవా అంతకంతకూ పెరుగుతూ పోతుంది. నటుడిగా, రచయితగా సత్తా చాటుతున్నారు. హైపర్ ఆది పలు సినిమాలకు డైలాగ్స్ అందిస్తున్నారు. రవితేజ లేటెస్ట్ సూపర్ హిట్ ధమాకా చిత్రానికి మాటల రచయితగా ఆయన పనిచేశారట.

25

ఇదిలా ఉంటే ధనుష్ లేటెస్ట్ మూవీ 'సార్' లో హైపర్ ఆది ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 17న సార్ విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న హైపర్ ఆది ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్తతో పాటు దర్శక నిర్మాతల పై ప్రశంసలు కురిపించారు. 
 

35
Hyper Aadi

నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగవంశీ గారు ముక్కు సూటిగా మాట్లాడతారు. నిజాయితీగా ఆయన చేసే కామెంట్స్ ని అప్పుడప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు. నాగవంశీ గురించి పూర్తిగా తెలిస్తే ఆయన్ని విమర్శించరు. ఒకసారి నేను కాల్ చేసి భీమ్లా నాయక్ షూట్ రాలేను సార్. ఒక రోజు గ్యాప్ కావాలి. ఢీ వాళ్లు అడుగుతున్నారని చెప్పాను.

45
Hyper aadi , PawanKalyan


నీకు పవన్ కళ్యాణ్ కావాలా? ఢీ కావాలా? తేల్చుకో అన్నారు. ఆ మాటకు నేను రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని భీమ్లా నాయక్ షూట్ కి వెళ్లిపోయానని చెప్పారు. భీమ్లా నాయక్ మూవీలో హైపర్ ఆది చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు. 

55


పవన్ కళ్యాణ్ ని అమితంగా ఆరాధించే వ్యక్తుల్లో హైపర్ ఆది ఒకరు. ఈయన జనసేన పార్టీలో కీలక నేతగా మారుతున్నారు. యువ గర్జన సభలో హైపర్ అది గర్జించాడు. రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది జనసేన తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. తన సొంత జిల్లా అయిన ప్రకాశంలోని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడట.

 

Read more Photos on
click me!

Recommended Stories