రెడీ, దుబాయ్ శ్రీను, నమో వెంకటేశా, బొమ్మరిల్లు వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. లేడీ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో భర్త సురేష్ తేజ కన్నుమూశాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించారు. 2019లో భర్త మరణించగా కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమయ్యారు.