2019లో ‘రాజా వారు రాణి గారు’తో అరంగేట్రం చేసాడు కిరణ్. ఈ సినిమా మంచి హిట్ అయింది. తన నటనతో, అమాయకంతో కూడిన క్యారెక్టర్‌తో యువతను ఆకట్టుకున్నాడు. తర్వాత 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కోవిడ్ తర్వాత థియేటర్ల కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అతన్ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌కి బిసి సెంటర్స్‌లో, ఫ్యామిలీస్‌లో విపరీతమైన క్రేజ్‌వచ్చింది.